కొత్తఓట్ల నమోదుకు అవకాశం

ABN , First Publish Date - 2021-10-24T07:01:40+05:30 IST

అర్హులైన యువతీ, యువకులందరూ ఓటర్ల జాబితాలో తమపేర్లు నమోదుకు దరఖాస్తు చేసుకోవాలని దర్శి నియోజకవర్గ ఓటర్ల నమోదు ఎన్నికల అధికారి ఉమాదేవి సూచించారు.

కొత్తఓట్ల నమోదుకు అవకాశం
కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తున్న జనసేన నాయకులు

కొత్తఓట్ల నమోదుకు అవకాశం

దర్శి, అక్టోబరు 23 : అర్హులైన యువతీ, యువకులందరూ ఓటర్ల జాబితాలో తమపేర్లు నమోదుకు దరఖాస్తు చేసుకోవాలని దర్శి నియోజకవర్గ ఓటర్ల నమోదు ఎన్నికల అధికారి ఉమాదేవి సూచించారు. దర్శిలో శనివారం వివిద కళాశాలల విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యువతీ యువకులు ఓటుహక్కు బాధ్యతగా గుర్తించి 18 సంవత్సరాలు నిండిన అందరూ ఓటర్ల జాబితాలో పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. ప్రజాసామ్య వ్యవస్థను పటిష్టం చేసుకునేందుకు ఓటుహక్కు తప్పనిసరిగా వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ వరకుమార్‌, వివిద కళాశాలల విద్యార్ధులు పాల్గొన్నారు.

ఉలవపాడు :అర్హులైన ప్రతి ఒక్కరూ విధిగా ఓటు హక్కు కలిగి ఉండాలని  తహసీల్దార్‌ కే సంజీవరావు విద్యార్థులకు సూచించారు. 18 ఏళ్లు దాటిన ప్రతి వ్యక్తి ఓటు హక్కు పొందాలని శనివారం స్ధానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన కొత్తగా ఓటు హక్కు పొందడంతోపాటు ఫారం-6 ధరఖాస్తు చేసుకునే విధానం గురించి విద్యార్ధులకు వివరించారు. ఇది నిరంతర ప్రక్రియ అని ఓటు హక్కు వయసు కలిగిన ప్రతి ఒక్కరు ఓటరు నమోదు చేయించుకోవాలని కోరారు. కళాశాల ప్రిన్సిపాల్‌ సుధారాణి, వైస్‌ ప్రిన్సిపాల్‌ సాయి సురే్‌షలు విద్యార్థులకు ఓటు విలువను గురించి వివరించారు. కార్యక్రమంలో ఆర్‌ఐ బ్రహ్మయ్య, వీఆర్‌వో ప్రశాంత్‌, కళాశాల అధ్యాపకులు, విద్యార్ధులు తదితరులు పాల్గొన్నారు.    

దొనకొండ  : 2003 సంవత్సరంలో పుట్టి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క యువతీ, యువకులు ఓటర్లుగా నమోదు చేసుకోవాలని దర్శి నియోజకవర్గ ఎన్నికల అధికారిణి ఉమాదేవి పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు స్థానిక ప్రభుత్వ జూనియర్‌  కళాశాల విద్యార్థులకు ఓటుహక్కుపై అవగాహన కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఓటర్ల జాబితాలో యువకుల సంఖ్య తగ్గిపోయిందని యువత ఓటరుగా అధికంగా నమోదైతేనే వారి ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు. యువత ఓటుహక్కు ప్రాధాన్యత తెలుసుకునేలా కళాశాలకు వెళ్లి అవగాహన  కల్పించి వారు ఓటుహక్కు పొందేలా చర్యలు చేపట్టాలని ఎన్నికల కమిషన్‌ ఆదేశించిందన్నారు. ఓటరుగా నమోదుకు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని మోబైల్‌లో ఎలక్షన్‌ కమిషన్‌ వెబ్‌సైట్‌లో ఫారం-6లో నమోదు చేసుకునే సౌకర్యం ఉందన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఎన్నికల కమిషన్‌ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఓటుహక్కు పొందాలని ఎన్నికల నమోదు అధికారిణి ఉమాదేవి విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ కే.వెంకటేశ్వరరావు, కళాశాల అధ్యాపకులు కరిముల్లా, షేక్‌ ఖాదర్‌, కె మహలక్ష్మీ, బి రమణారెడ్డి, కె వసుందర, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-24T07:01:40+05:30 IST