22 ఏళ్ల కుర్రాడితో ఇంటర్ విద్యార్థిని ప్రేమయాణం.. ఆ బాలిక తల్లిదండ్రులు హెచ్చరించారని నేరుగా ఇంట్లోకే వెళ్లి..

ABN , First Publish Date - 2021-07-30T16:20:19+05:30 IST

ఆ బాలిక వయసు 17 ఏళ్లు.. ఇంటర్ చదువుతోంది.. 22 ఏళ్ల యువకుడితో ప్రేమలో పడింది..

22 ఏళ్ల కుర్రాడితో ఇంటర్ విద్యార్థిని ప్రేమయాణం.. ఆ బాలిక తల్లిదండ్రులు హెచ్చరించారని నేరుగా ఇంట్లోకే వెళ్లి..

ఆ బాలిక వయసు 17 ఏళ్లు.. ఇంటర్ చదువుతోంది.. 22 ఏళ్ల యువకుడితో ప్రేమలో పడింది.. ఆ విషయం తల్లిదండ్రులకు తెలిసి వారు బాలికను హెచ్చరించారు.. ఆ యవకుడు మంచివాడు కాదని నచ్చచెప్పారు.. తల్లిదండ్రుల మాటలు విన్న బాలిక ఆ యువకుడిని పట్టించుకోవడం మానేసింది.. దీంతో బాలిక తల్లిదండ్రుల మీద కోపం పెంచుకున్న యువకుడు స్నేహితులతో కలిసి నేరుగా ఇంటికి వెళ్లి వారిపై దాడి చేశాడు.. తమిళనాడులోని తిరుచ్చిలో ఈ ఘటన తాజాగా జరిగింది.


తిరుచ్చికి చెందిన అగస్టిన్ అనే యువకుడు 17 ఏళ్ల బాలికతో ప్రేమలో పడ్డాడు. ఆ బాలిక కూడా అగస్టిన్‌ను ప్రేమించింది.. అయితే ఆ ప్రేమకు బాలిక తల్లిదండ్రులు అడ్డుచెప్పారు.. యువకుడి గురించి తెలుసుకుని అతడు మంచివాడు కాదని కూతురికి నచ్చచెప్పారు.. దీంతో ఆమె అగస్టిన్‌ను దూరం పెట్టింది. దీంతో బాలిక తల్లిదండ్రులపై అగస్టిన్ కోపం పెంచుకున్నాడు. స్నేహితులతో కలిసి గురువారం నేరుగా బాలిక ఇంటికి వెళ్లిన అగస్టిన్ ఆమె తల్లిదండ్రులపై దాడికి పాల్పడ్డాడు. ఇరుగుపొరుగు వారు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అగస్టిన్‌తో పాటు అతని స్నేహితులు సూర్య, పార్థిబన్‌లను అరెస్ట్ చేశారు.    

Updated Date - 2021-07-30T16:20:19+05:30 IST