ప్రభుత్వ విధానాలతో ప్రజల్లో వ్యతిరేకత

ABN , First Publish Date - 2022-05-15T05:23:58+05:30 IST

రాష్ట్ర ప్రభు త్వం అనుసరిస్తున్న విధానాలతో ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని ఎంపీ కింజరాపు రామ్మోహన్‌ నాయుడు అన్నారు. చొర్లంగి పంచాయతీ మురగడలోయ గిరిజన గ్రామంలో ఓ శుభ కార్యక్రమానికి హాజరైన ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. విద్యుత్‌, ఆర్టీసీ చార్జీల పెంపుతో పాటు నిత్యావసర ధరలు ఆకాశాన్నంటాయని, దీంతో సామాన్య, మధ్య తరగతి కు టుంబాలపై మోయలేని భారం పడిందని ఆరోపించారు.

ప్రభుత్వ విధానాలతో ప్రజల్లో వ్యతిరేకత
మురగడలోయ గ్రామంలో పర్యటిస్తున్న ఎంపీ


 ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు
మురగడలోయ(ఎల్‌.ఎన్‌.పేట), మే 14:
రాష్ట్ర ప్రభు త్వం అనుసరిస్తున్న విధానాలతో ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని ఎంపీ కింజరాపు రామ్మోహన్‌ నాయుడు అన్నారు. చొర్లంగి పంచాయతీ మురగడలోయ గిరిజన గ్రామంలో ఓ శుభ కార్యక్రమానికి హాజరైన ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. విద్యుత్‌, ఆర్టీసీ చార్జీల పెంపుతో పాటు నిత్యావసర ధరలు ఆకాశాన్నంటాయని, దీంతో సామాన్య, మధ్య తరగతి కు టుంబాలపై మోయలేని భారం పడిందని ఆరోపించారు.  ప్రభుత్వ వ్యతిరేక విధానాలతో విసుగు చెందుతున్న ప్రజలు ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నారన్నారు. ఆయనతోపాటు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కలమట సాగర్‌, పార్టీ మండల కార్యదర్శి కె.చిరంజీవి, నాయకులు ఎస్‌.కిశోర్‌కుమార్‌, ఎం.సూర్యనారాయణ ఉన్నారు. 

Read more