
ప్రకాశం: CM Jaganmohan Reddy ఇంటి నుంచి అసెంబ్లీకి వెళ్లాలంటే రోడ్డుపక్కన పరదాలు కడుతున్నారని కొండపి టీడీపీ ఎమ్మెల్యే బాలవీరాంజనేయస్వామి అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇంకెక్కడికైనా వస్తే చుట్టూ తెరలు కట్టుకుంటున్నాడని ఎద్దేవా చేశారు. ఇటీవల జగన్ ఒంగోలు వస్తే జనం రెండు రోజులు ఇబ్బందులు పడ్డారని చెప్పారు. APలో అత్యాచారాలు విపరీతంగా పెరిగాయన్నారు.మూడేళ్లలో 1000కి పైగా అత్యాచారాలు జరిగాయన్నారు. దిశా చట్టంకి కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి లభించలేదని హోంమంత్రి చెబుతున్నారన్నారు. అంతకంటే పదునైన నిర్భయ చట్టాన్ని వాడి పటిష్టంగా పని చెయ్యాలని చెప్పారు.ప్రతిపక్షాన్ని అణచివేయాలంటే ఆగదన్నారు. వైసీపీలో సొంత పార్టీ నేతలపైనే ఆ పార్టీ కార్యకర్తలు తిరగబడుతున్నారని బాలవీరాంజనేయస్వామి అన్నారు.
ఇవి కూడా చదవండి