ప్రతిపక్షాలవి తప్పుడు ఆరోపణలు

ABN , First Publish Date - 2021-03-01T03:46:47+05:30 IST

ఎమ్మెల్సీ ఎన్నికల గెలుపు కోసం ప్రతిపక్షాలైన బీజేపీ, కాంగ్రెస్‌ పా ర్టీలు రాష్ట్ర ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ని రంజన్‌రెడ్డి విమర్శించారు.

ప్రతిపక్షాలవి తప్పుడు ఆరోపణలు
పట్టభద్రులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి నిరంజన్‌రెడ్డి

  రాష్ట్ర వ్యవసాయ  శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి 

పెద్దమందడి, ఫిబ్రవరి 28: ఎమ్మెల్సీ ఎన్నికల గెలుపు కోసం ప్రతిపక్షాలైన బీజేపీ, కాంగ్రెస్‌ పా ర్టీలు రాష్ట్ర ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ని రంజన్‌రెడ్డి విమర్శించారు.  మండలంలోని దొడ గుంటపల్లిలో ఆదివారం పట్టభద్రుల ప్రత్యేక స మావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మం త్రి మాట్లాడుతూ తెలంగాణలో అమలు అవుతున్న ఏ ఒక్క పథకం అయినా బీజేపీ, కాంగ్రెస్‌ పాలిస్తున్న రాష్ట్రాలలో అమలుచేస్తున్నారా అని ఆయన ప్రశ్నిం చారు. అందుకే యువత బాగా ఆలోచించి టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. సురభి వాణిదేవికి మొదటి ప్రాధా న్యత ఓటు వేయాలని సూచించారు. ఎన్నికల కోడ్‌ ఉన్నందున మరిన్ని ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి ఇవ్వలేక పోయామని, త్వరలో నియామకాలు చేపడుతామని ఆయన హామీ ఇ చ్చారు. అంతకు ముందు గ్రామంలో బీరప్ప ఉత్సవాల్లో మంత్రి పాల్గొ న్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ వరలక్ష్మి, నాయకులు అశోక్‌రెడ్డి, జానకి రా ములు, నారాయణరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి  తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-01T03:46:47+05:30 IST