Pegasus కు స్వస్తి పలకనున్న విపక్షాలు.. వ్యూహం మార్చిన ప్రత్యర్థులు

ABN , First Publish Date - 2021-08-01T19:07:55+05:30 IST

పెగాసస్ స్పైవేర్ విషయంలో ప్రతిపక్షాలు మరో కీలక నిర్ణయం తీసుకున్నాయి. త్వరలోనే ఈ విషయంపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని

Pegasus కు స్వస్తి పలకనున్న విపక్షాలు.. వ్యూహం మార్చిన ప్రత్యర్థులు

న్యూఢిల్లీ :  పెగాసస్ స్పైవేర్ విషయంలో ప్రతిపక్షాలు మరో కీలక నిర్ణయం తీసుకున్నాయి. త్వరలోనే ఈ విషయంపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించుకున్నాయి. పెగాసస్ విషయంలో జోక్యం చేసుకోవాలంటూ సుప్రీం కోర్టును విపక్ష నేతలు కోరనున్నారు. ‘‘దేశ భద్రత దృష్ట్యా పెగాసస్ చాలా సీరియస్ అంశం. పెగాసస్ విషయంలో తాము సుప్రీంకోర్టును ఆశ్రయించాలని అనుకున్నాం. దీనిపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని కోరుతాం’’ అని ఓ విపక్ష నేత పేర్కొన్నారు. పెగాసస్ వ్యవహారం పార్లమెంట్ సమావేశాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్న అంశం తెలిసిందే. దీనిపై ప్రభుత్వం స్పష్టమైన వివరణ ఇవ్వాలని కోరుతూ విపక్షాలు ఉభయ సభల్లోనూ ప్రతిరోజూ ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై ప్రభుత్వం సీరియస్‌గా మండిపడుతోంది. దీంతో తమ వ్యూహాన్ని మార్చుకోవాలని విపక్షాలు నిర్ణయించుకున్నాం. పెగాసస్ వ్యవహారాన్ని పార్లమెంట్‌లో ప్రస్తావించే బదులు, ఏకంగా సుప్రీం మెట్లు ఎక్కితే సరిపోతుందని విపక్ష కూటమిలో కొందరు గాఢంగా అభిప్రాయపడుతున్నారు.  దీంతో మిగతా విపక్ష సభ్యులు కూడా సుప్రీం మెట్లెక్కేందుకు ఓకే చెప్పారు. ‘‘సోమవారం నుంచి ఉభయ సభల్లోనూ మా ఎజెండా పూర్తిగా మారిపోనుంది. పెరిగిన నిత్యావసర ధరలు, పెట్రో ధరలు, కోవిడ్ కేసులు, ద్రవ్యోల్బణం లాంటి అంశాలపై ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తాం’’ అని విపక్ష నేత ఒకరు తెలిపారు. 

Updated Date - 2021-08-01T19:07:55+05:30 IST