కాంగ్రెస్ పార్టీ ఆప్‌తో ఎందులోనూ పోటీపడలేనని చేతులెత్తేసింది. ఇతర పద్ధతులతో రకరకాల ఇబ్బందులకు గురిచేసినా, గోదీ మీడియాతో ప్రచారం చేసుకున్నా డిల్లీలో ఆమ్ఆద్మీ పార్టీని మూడవసారి అధికారంలోకి రాకుండ చేయలేకపోయింది దేశాన్నేలుతున్న బిజెపి. డిల్లీకే పరిమితమైతే తనను తాను బిజెపి నుండి రక్షించుకోవడం కష్టమనుకున్న కేజ్రీవాల్ ఇప్పుడు పంజాబ్‌కు విస్తరించారు. ఆప్‌ను రక్షించుకోవాలన్నా, దేశప్రజలకు ఆదర్శ పాలనను అందించాలన్నా ఇతర రాష్ట్రాలకు విస్తరిస్తేనే సాధ్యమౌతుందని కేజ్రీజీ గ్రహించినట్టున్నారు. వెంకి పెళ్ళి సుబ్బి చావుకొచ్చిందన్నట్టు ఆప్ విస్తరణ ఆయా రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతీయ పార్టీల ప్రభుత్వాలకు వచ్చింది. అందుకే మమతగాని, నితిన్‌గాని, స్టాలిన్గాని, కేసీఆర్‌గాని మరెవరైనా ముఖ్యమంత్రులుగాని తమకు చేతగాకున్నా, సాధ్యం కాదనుకున్నా కేజ్రీవాల్ చేస్తున్న అభివృద్ధి పనులకు, నిజాయితీ గల పాలనతో పోటీపడాల్సిన పరిస్థితి వచ్చింది. తమ అస్తిత్వాన్ని నిలబెట్టుకోవాలనుకున్నా తాము అధికారంలోకి తిరిగి రావాలన్నా కాంగ్రేస్, బిజెపియేతర ప్రతిపక్షాలు ఆ పద్ధతులు అనుసరించాల్సిందే.
రాములు చందా