ఫోన్ యాప్‌లో కాల్స్ రికార్డింగ్ ఆప్షన్
ABN , First Publish Date - 2021-04-10T06:02:17+05:30 IST
అపరిచితుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్‌ను గూగుల్ యాప్‌తో రికార్డ్ చేయొచ్చు. గత ఏడాది విడుదల చేసి యాప్‌నకు కాల్ రికార్డింగ్ సపోర్టును అదనంగా చేర్చింది
అపరిచితుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్‌ను గూగుల్ యాప్‌తో రికార్డ్ చేయొచ్చు. గత ఏడాది విడుదల చేసి యాప్‌నకు కాల్ రికార్డింగ్ సపోర్టును అదనంగా చేర్చింది. లేటెస్ట్ అప్డేట్తో దీనిని అందుబాటులోకి తెచ్చుకోవచ్చు. ఈ ఏడాది జనవరిలోనే సదరు ఫీచర్‌ను గూగుల్ టెస్టింగ్‌లో ఉంచిందని సమాచారం. గూగుల్ ఫోన్ యాప్‌లో దీనిని మాన్యువల్‌గానే చూడవచ్చు. మూడు డాట్స్ మెనూలో సెట్టింగ్స్‌ను సెలెక్ట్ చేస్తే ఆప్షన్స్‌లో ‘కాల్ రికార్డింగ్’ కనిపిస్తుంది. ఫోన్లో ఈ ఫీచర్ ఉంటే చూడవచ్చు. స్ర్కోల్ డౌన్ చేసి ‘ఆల్వేస్ రికార్డ్’లో ఉండే ‘నంబర్స్ నాట్ ఇన్ యువర్ కాంటాక్ట్’ని సెలెక్ట్ చేయాలి. టోగుల్(ఫీచర్‌ను స్విచాన్ చేయడం)తో తెలియని నంబర్ల నుంచి వచ్చే కాల్స్‌ను రికార్డు చేయవచ్చు.