Viral Video: పులి పిల్లలకు అమ్మ ప్రేమను అందిస్తున్న చింపాంజీ.. నెటిజన్లు ఫిదా

ABN , First Publish Date - 2022-07-02T01:21:01+05:30 IST

ఈ సృష్టిలో తల్లి ప్రేమ అతి పవిత్రమైనది. ఆ ప్రేమకు తారతమ్యాలు, జాతి భేదాలు ఉండవు.

Viral Video: పులి పిల్లలకు అమ్మ ప్రేమను అందిస్తున్న చింపాంజీ.. నెటిజన్లు ఫిదా

ఈ సృష్టిలో తల్లి ప్రేమ అతి పవిత్రమైనది. ఆ ప్రేమకు తారతమ్యాలు, జాతి భేదాలు ఉండవు. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో ఓ చింపాంజీ అలాంటి ప్రేమనే ప్రదర్శిస్తోంది. పులి పిల్లలకు ప్రేమను పంచుతోంది. అమెరికాలోని సౌత్ కరోలినాలో మిర్టిల్ బీచ్ సఫారీలో చింపాంజీ, మూడు పులి పిల్లలను ప్రేమగా లాలిస్తోంది. ఆ పులి పిల్లలు కూడా తమ తల్లితో ఎలా ఉంటాయో ఆ చింపాంజీతో కూడా అలాగే ఆడుకుంటున్నాయి.  ఆ చింపాంజీ వాటికి పాలు తాగిస్తూ, ప్రేమగా నిమురుతూ ఆడిస్తోంది. 


ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ అధికారి సామ్రాట్ గౌడ ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ఆ వీడియోను చూసిన నెటిజన్లు చింపాంజీ ప్రవర్తనకు ఫిదా అవుతున్నారు. లైక్‌లు, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 

Updated Date - 2022-07-02T01:21:01+05:30 IST