Viral Video: మనుషులు ఎలా కాలుస్తారో అచ్చం అలాగే.. జూలో Orangutan చేసిన పనికి ముక్కున వేలేసుకుంటున్న నెటిజన్లు!

ABN , First Publish Date - 2022-06-25T18:31:45+05:30 IST

Orangutan(ఒరంగుటాన్).. కోతి జాతుల్లో ఒకటి. ప్రస్తుతం ఓ ఒరంగుటాన్‌కు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అచ్చం మనుషుల్లాగే అది ప్రవర్తించడం చూసి కొందరు షాకవుతున్నారు. మరికొందరేమో జూ సి

Viral Video: మనుషులు ఎలా కాలుస్తారో అచ్చం అలాగే.. జూలో Orangutan చేసిన పనికి ముక్కున వేలేసుకుంటున్న నెటిజన్లు!

ఇంటర్నెట్ డెస్క్: Orangutan(ఒరంగుటాన్).. కోతి జాతుల్లో ఒకటి. ప్రస్తుతం ఓ ఒరంగుటాన్‌కు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అచ్చం మనుషుల్లాగే అది ప్రవర్తించడం చూసి కొందరు షాకవుతున్నారు. మరికొందరేమో జూ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జూ సిబ్బంది స్పందిస్తూ వివరణ ఇచ్చారు. అది అలా ప్రవర్తించడంలో తమ ప్రమేయం లేదని పేర్కొంటున్నారు. కాగా.. ఇంతకూ ఏం జరిగిందనే పూర్తి వివరాల్లోకి వెళితే..



వియత్నంలోని సైగాన్ జూ అండ్ బొటానికల్ గార్డెన్‌లో ఉన్న ఓ Orangutan వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియోలో అది సిగరేట్‌ను అచ్చం మనుషుల్లానే తాగుతుంది. చేతి వేళ్ల మధ్య సిగరేట్ పెట్టుకుని.. నోట్ల పెట్టుకుని పీల్చుతూ.. బయటకు పొగ వదులోంది. కాగా.. దీంతో స్పందిస్తున్న కొందరు నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తుండగా.. మరికొందరేమో జూ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. సిగరేట్ కాల్చడంపై జూ సిబ్బందే దానికి శిక్షణ ఇచ్చి ఉంటారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో జూ ప్రతినిధులు స్పందించి, వివరణ ఇచ్చారు. సిబ్బంది ఎవరూ జూ పరిసరాల్లో సిగరేట్లు కాల్చరనీ.. ఎవరో ఒక విజిటర్ సిగరేట్ కాల్చుతూ దాన్ని Orangutan వైపు విసిరేశారని చెప్పారు. విజిటర్లు సిగరెట్ తాగడాన్ని గమనించిన ఒరంగుటాన్.. వారిని అనుకరించి ఉంటుందని అభిప్రాయపడ్డారు. సిగరేట్ ఎలా తాగాలి అనే విషయంపై దానికి ఎవరూ శిక్షణ ఇవ్వలేదని స్పష్టం చేశారు. 




Updated Date - 2022-06-25T18:31:45+05:30 IST