ఒలెక్ట్రాకు రూ.3,675 కోట్ల ఆర్డర్‌

ABN , First Publish Date - 2022-05-24T09:38:37+05:30 IST

ఎలక్ట్రిక్‌ బస్సులను సరఫరా చేయడానికి ఒలెకా్ట్ర గ్రీన్‌టెక్‌కు అతిపెద్ద ఆర్డర్‌ లభించింది.

ఒలెక్ట్రాకు రూ.3,675 కోట్ల ఆర్డర్‌

‘బెస్ట్‌’కు 2,100 ఎలక్ట్రిక్‌ బస్సుల సరఫరా

హైదరాబాద్‌ (ఆం ధ్రజ్యోతి బిజినెస్‌): ఎలక్ట్రిక్‌ బస్సులను సరఫరా చేయడానికి ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌కు అతిపెద్ద ఆర్డర్‌ లభించింది. బృహన్‌ ముంబై ఎలక్ట్రిక్‌ సప్లయ్‌ అండ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ (బీఈఎ్‌సటీ, బెస్ట్‌)నుంచి రూ.3,675 కోట్ల విలువైన 2,100 ఎలక్ట్రిక్‌ బస్సులను సరఫరా చేయడానికి లెటర్‌ ఆఫ్‌ అవార్డు (ఎల్‌ఓఏ) పొందినట్లు ఒలెకా్ట్ర చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ కేవీ ప్రదీప్‌ తెలిపారు. ఇండియన్‌ ఎలక్ట్రిక్‌ మొబిలిటీ చరిత్రలో ఇదొక మైలురాయని వ్యాఖ్యానించారు. 1,500 బస్సుల సరఫరాకు ఎల్‌-1 బిడ్డర్‌గా ఎంపిక చేసిన అనంతరం ఎల్‌ఓఏ ఇచ్చేటప్పుడు బస్సుల సంఖ్యను 2100కు బీఈఎ్‌సటీ పెంచింది. ఒలెక్ట్రాకు చెందిన ఈవీ ట్రాన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఈ ఎల్‌ఓఏ పొందింది. గ్రాస్‌ కాస్ట్‌ కాంట్రాక్ట్‌  (జీసీసీ)/ఒపెక్స్‌ మోడల్‌ ప్రాతిపదికన 2,100 బస్సులను బెస్ట్‌కు ఈవీ ట్రాన్స్‌ అందిస్తుంది. వీటిని ఒలెకా్ట్ర గ్రీన్‌టెక్‌ నుంచి పొందుతుంది. 12 సంవత్సరాలు ఉండే కాంట్రాక్టు కాలంలో బస్సుల నిర్వహణను ఒలెక్ట్రా చేపడుతుంది. ఆర్డర్‌లో భాగంగా 12 మీటర్ల పొడవు ఉండే ఏసీ బస్సులను ఒలెక్ట్రా సరఫరా చేస్తుంది. 

Updated Date - 2022-05-24T09:38:37+05:30 IST