"ఒరేయ్ బామ్మర్ది": అక్టోబర్ 1న ఆహాలో విడుదల

Sep 28 2021 @ 09:26AM

సిద్దార్థ్ నటించిన సినిమా "ఒరేయ్ బామ్మర్ది". ఈ మూవీ అక్టోబర్ 1న తెలుగు ఓటీటీ ఆహాలో విడుదల చేయనున్నారు. ఈ మేరకు తాజాగా ఓ పోస్టర్‌ను వదిలి అఫీషియల్ కన్‌ఫర్మేషన్ ఇచ్చారు. అటు తమిళ ప్రేక్షకులతో పాటు, తెలుగు ప్రేక్షకులకి ద‌గ్గ‌రైన హీరో సిద్ధార్థ్‌. కొన్నేళ్లుగా తెలుగు సినిమాలలో క‌నిపించ‌ని ఆయ‌న, మళ్ళీ వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ క్రమంలోనే ‘ఒరేయ్ బామ్మ‌ర్ది’ మూవీతో తెలుగు ప్రేక్ష‌కుల్ని ప‌ల‌క‌రించబోతున్నారు. ఈ సినిమాలో సంగీత దర్శకుడు  జి.వి.ప్ర‌కాష్ మ‌రో హీరోగా న‌టించారు. ‘బిచ్చ‌గాడు’ లాంటి సూపర్ హిట్ త‌ర్వాత ద‌ర్శ‌కుడు శ‌శి నుంచి వ‌స్తున్న 'ఒరేయ్ బామ్మర్ది' చిత్రమీద బాగానే అంచనాలున్నాయి. కాగా ఈ చిత్రాన్ని ఆహాలో అక్టోబర్ నుంచి స్ట్రీమింగ్‌కి సిద్దం చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ట్రైలర్‌ను విడుదల చేశారు.


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.