అవయవదానం.. ఆరుగురికి కొత్త జీవితం

ABN , First Publish Date - 2021-10-26T06:45:53+05:30 IST

తన అవయవాలు దానం చేసి ఆరుగురికి జీవం పోశారు భువనగిరి పట్టణానికి చెందిన సతీ్‌షకుమార్‌. తాను అస్తమించినా మరో ఆరుగురి జీవితాల్లో వెలుగులు నింపారు.

అవయవదానం.. ఆరుగురికి కొత్త జీవితం
మెతుకు సతీ్‌షకుమార్‌

స్ఫూర్తి చాటిన సతీష్‌  కుటుంబసభ్యులు

ఈ నెల 21న రోడ్డు ప్రమాదంలో బ్రెయిన డెడ్‌ 


భువనగిరిటౌన, అక్టోబరు 25: తన అవయవాలు దానం చేసి ఆరుగురికి జీవం పోశారు భువనగిరి పట్టణానికి చెందిన సతీ్‌షకుమార్‌. తాను అస్తమించినా మరో ఆరుగురి జీవితాల్లో వెలుగులు నింపారు. భువనగిరి పట్టణానికి చెందిన మెతుకు సతీ్‌షకుమార్‌(47) రైల్వేస్టేషన ఎదురుగా నివాసముండేవారు. ఆయన సికింద్రాబాద్‌ రాణిగంజ్‌లో ఓ జ్యుయలరీ దుకాణంలో పనిచేసేవాడు. ఈ నెల 21న తెల్లవారుజామున ద్విచక్రవాహనంపై విధులకు వెళ్తుండగా మేడ్చల్‌ జిల్లా ఘట్కేసర్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. వైద్య చికిత్స నిమిత్తం కుటుంబసభ్యులు అతడిని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు బ్రెయినడెడ్‌ అయినట్లు గుర్తించారు. దీంతో కుటుంబసభ్యులు అతని అవయవాలు జీవనదాన ట్రస్ట్‌కు దానంచేయగా సోమవారం వాటి ని సేకరించారు. అవయవదానానికి ముందుకొచ్చిన సతీష్‌ కుటుంబాన్ని పలువురు ప్రశంసించారు. సతీ్‌షకుమార్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు, కు మారుడు ఉన్నారు. భువనగిరిలో బంధుమిత్రుల అశ్రునయనాల నడుమ సోమవారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు. 


Updated Date - 2021-10-26T06:45:53+05:30 IST