సేంద్రియ వ్యవసాయం లాభదాయకం

ABN , First Publish Date - 2021-03-07T04:42:25+05:30 IST

సేంద్రియ వ్యవసాయం రైతులకు సిరులు కురిపిస్తుందని జిల్లా వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్‌ చంద్రనాయక్‌ తెలిపారు.

సేంద్రియ వ్యవసాయం లాభదాయకం
మాట్లాడుతున్న జిల్లా వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్‌ చంద్రనాయక్‌

రైల్వేకోడూరు రూరల్‌, మార్చి 6: సేంద్రియ వ్యవసాయం రైతులకు సిరులు కురిపిస్తుందని జిల్లా వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్‌ చంద్రనాయక్‌ తెలిపారు. శనివారం మండలంలోని అనంతరాజుపేట ఉద్యాన పరిశోధనా కేంద్రంలో వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో మండలంలోని వీఏఏ, వీహెచ్‌ఏ, వీఎ్‌సఏల శిక్షణ కార్యక్రమానికి హాజరుయ్యారు. రైతు భరోసా కేంద్రాలలో ఉన్న సిబ్బందికి శిక్షణ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపా రు. ఉద్యాన పరిశోధనా కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌.నాగరాజు మా ట్లాడుతూ మామిడిలో సమగ్ర పోషక యాజమాన్యం, చీడ పీడలు నివారణపై వివరించారు. కళాశాల అసోసియేట్‌ డీన్‌ డాక్టర్‌. శ్రీనివాసులు మా ట్లాడుతూ అరటిలో అధిక దిగుబడికి తీసుకోవాలసిన చర్యలు గురించి వివరించారు. శాస్త్రవేత శ్రీధర్‌ మాట్లాడుతూ బొప్పాయిలో సమగ్ర పోషక యాజమాన్యం గురించి వివరించారు. రైల్వేకోడూరు వ్యవసాయ సంచాలకురాలు కె.కవిత వ్యవసాయంలో జీవన ఎరువుల ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారులు జి.సుధాకర్‌, శ్రీరాములు, ఓబులవారిపల్లి అధికారి పి.సందీప్‌, చిట్వేలి అధికారి ఎం.క్రిష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-07T04:42:25+05:30 IST