Reunites after 33 Years: ఒకరికి ఏడేళ్లు.. మరొకరికి 10 ఏళ్ల వయసున్నప్పుడు విడిపోయారు.. 33 ఏళ్ల తర్వాత ఈ అక్కాచెల్లెళ్లు ఎలా కలిశారంటే..

ABN , First Publish Date - 2022-08-23T16:40:22+05:30 IST

ఒకరికి ఏడేళ్లు.. మరొకరికి 10 ఏళ్ల వయసున్నప్పుడు ఆ అక్కాచెల్లెళ్లు విడిపోయారు. 33 ఏళ్ల తర్వాత తాజాగా కలుసుకున్నారు.

Reunites after 33 Years: ఒకరికి ఏడేళ్లు.. మరొకరికి 10 ఏళ్ల వయసున్నప్పుడు విడిపోయారు.. 33 ఏళ్ల తర్వాత ఈ అక్కాచెల్లెళ్లు ఎలా కలిశారంటే..

దుబాయ్: ఒకరికి ఏడేళ్లు.. మరొకరికి 10 ఏళ్ల వయసున్నప్పుడు ఆ అక్కాచెల్లెళ్లు (Sisters) విడిపోయారు. 33 ఏళ్ల తర్వాత తాజాగా కలుసుకున్నారు. దక్షిణాఫ్రికాకు (South Africa) చెందిన ఈ సిస్టర్స్‌ చిన్నప్పుడే తల్లిదండ్రులను (Parents) కోల్పోవడంతో స్థానికంగా ఉండే ఓ చర్చి ద్వారా వారు వేర్వేరు అనాథశ్రయాలకు వెళ్లిపోయారు. అక్కడే పెరిగారు. అలా ఆ అనాథశ్రయాల్లో (Orphangae) పెరిగి పెద్దైనా.. అక్కాచెల్లెళ్లు అక్కడి నుంచి వేర్వేరు దేశాలకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. ఒకరు టీచర్‌గా యూఏఈలో స్థిరపడితే.. మరొకరు కెనడాలో సెటిల్ అయ్యారు. ఇలా వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నా వీరు.. 33 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఎలా కలుసుకున్నారు? అసలు వీరు కలవడానికి హెల్ప్ చేసిందెవరు? అనే వివరాలు తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.. 



దక్షిణాఫ్రికాలోని కెన్సింగ్టన్‌లో తానియా జెంకిన్సన్‌(08), గ్లినిస్ రూయిటర్స్ (10) అనే ఇద్దరు సిస్టర్స్ తమ తల్లిదండ్రులతో కలిసి ఉండేవారు. అయితే, వీరి తల్లి ఉబ్బసం (Asthma) కారణంగా చనిపోయింది. తల్లి చనిపోయిన కొన్ని రోజులకే తండ్రి కూడా అనారోగ్యం కారణంగా కన్నుమూశాడు. దాంతో అక్కాచెల్లెళ్లు అనాథలయ్యారు. వీరి పరిస్థితిని గమనించిన స్థానిక చర్చి.. వారిని వేర్వేరు అనాథశ్రయాలకు తరలించింది. అలా చిన్నప్పుడే తానియా, గ్లినిస్ వేరు అయ్యారు. ఆ తర్వాత అనాథశ్రయాల్లోనే పెరిగి పెద్దైనా.. వారు వేర్వేరు దేశాలకు వెళ్లిపోయారు. దాంతో శాశ్వతంగా దూరమైపోయారు. తానియా టీచింగ్‌లో డిగ్రీ పూర్తి చేసి 1991లో యూఏఈకి (UAE) వెళ్లిపోయింది. అక్కడ దుబాయ్, షార్జా స్కూళ్లలో పనిచేసింది. ఆ తర్వాత ఓ వ్యక్తితో తానియాకు వివాహమైంది. ఆమెకు ఇద్దరు పిల్లలు. మరోవైపు గ్లినిస్ కెనడాకు (Canada) చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుని అక్కడే స్థిరపడింది. అలా 30 ఏళ్లు గడిచిపోయాయి. కానీ, సిస్టర్స్ ఇద్దరూ ఒకరిని ఒకరు మరిచిపోలేదు. జీవితంలో ఎప్పుడో ఒకరోజు తప్పనిసరిగా కలుస్తామనే ఆశతో ఉండేవారు. 


ఈ క్రమంలో తానియాకు తాను పెరిగిన అనాథశ్రయంలోని మిత్రుల (Friends) ద్వారా తన అక్కా కెనడాలో ఉంటున్నట్లు తెలిసింది. దాంతో అక్కా పెరిగిన అనాథశ్రయం ద్వారా ఆమె వివరాలు తెలుసుకుంది. 2019లో మొదటిసారి గ్లినిస్‌కు ఫోన్ చేసి మాట్లాడింది. దీంతో అక్కాచెల్లెళ్ల ఆనందానికి అవధుల్లేవు. వెంటనే కలుసుకోవాలని ప్లాన్ చేశారు. కానీ, వీసా (Visa) సమస్యల కారణంగా ఆ ఏడాది కుదరులేదు. ఆ తర్వాత రెండేళ్లు కరోనా విజృంభించడంతో ప్రయాణ ఆంక్షల కారణంగా ఈ సిస్టర్స్ కలుసుకోలేకపోయారు. ఈ ఏడాది అంతా సద్దుమణగడంతో తాజాగా కలుసుకున్నారు. తానియా యూఏఈ (UAE) నుంచి కెనడా వెళ్లింది. కెనడా ఎయిర్‌పోర్టులో అక్కాచెల్లెళ్లు ఇద్దరు కలుసుకున్నారు. అంతే.. వారి ఆనందానికి అవధుల్లేవు. అయితే, వీరికి ఒక సోదరుడు కూడా ఉన్నాడట. అతడు మాత్రం మాతృదేశంలోనే ఉన్నట్లు అక్కాచెల్లెళ్లకు తెలిసింది. దీంతో ఎలాగైనా తమ సోదరుడిని కలవాలనే ప్రయత్నంలో తానియా, గ్లినిస్ ఉన్నారు.  




Updated Date - 2022-08-23T16:40:22+05:30 IST