TS News: ఓయూ నకిలీ సర్టిఫికెట్ల కేసులో కొనసాగుతున్న విచారణ

ABN , First Publish Date - 2022-08-18T02:11:56+05:30 IST

ఉస్మానియా యూనివర్సిటీ (Osmania University) నకిలీ సర్టిఫికెట్ల కేసులో రాచకొండ పోలీసుల (Rachakonda Police) విచారణ కొనసాగుతోంది.

TS News: ఓయూ నకిలీ సర్టిఫికెట్ల కేసులో కొనసాగుతున్న విచారణ

హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ (Osmania University) నకిలీ సర్టిఫికెట్ల కేసులో రాచకొండ పోలీసుల (Rachakonda Police) విచారణ కొనసాగుతోంది. అమెరికాలో ఉంటూ ఉస్మానియా యూనివర్సిటీ చెందిన నకిలీ సర్టిఫికెట్లను ముద్దం స్వామి అనే వ్యక్తి తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ముద్దం స్వామిని అమెరికా నుంచి రప్పించేందుకు నాచారం పోలీసులు ఎల్‌ఓసీ (LOC) జారీ చేశారు. ఇప్పటికే పదుల సంఖ్యలో విద్యార్థులకు ముద్దం స్వామి నకిలీ సర్టిఫికెట్లు ఇచ్చినట్లు గుర్తించారు. నకిలీ సర్టిఫికెట్లు ద్వారా విద్యార్థులు విదేశాలకు వెళ్లి పోయారని పోలీసులు చెబుతున్నారు. ఓయులో హోటల్ మేనేజ్‌మెంట్ పూర్తి చేసినట్లు ముద్దం స్వామి నకిలీ సర్టిఫికెట్లు తయారు చేసుకున్నాడు. అదే సర్టిఫికెట్‌పై 2021లో నిందితుడు అమెరికా (America) వెళ్లిపోయినట్లు పోలీసులు చెబుతున్నారు. నకిలీ సర్టిఫికెట్ల అవసరం ఉన్న విద్యార్థుల సమాచారం సేకరించి.. వారితో అమెరికా నుంచి ఇంటర్‌నెట్ కాల్స్ ద్వారా ముద్దం స్వామి సంప్రదించేవాడని పోలీసులు విచారణలో గుర్తించారు. అనంతరం వారికి ఓలా డ్రైవర్ల ద్వారా ఇంటి వద్దకే నకిలీ సర్టిఫికెట్లు అందజేస్తున్నట్టు పోలీసులు తేల్చారు. ఈ క్రమంలోనే అమెరికా నుంచి నిందితుడిని రప్పించి..  కస్టడీలోకి తీసుకోవాలని రాచకొండ పోలీసులు భావిస్తున్నారు.

Updated Date - 2022-08-18T02:11:56+05:30 IST