Hyderabad: జంట జలాశయాల్లోకి భారీగా వరద

ABN , First Publish Date - 2022-07-25T15:28:07+05:30 IST

భాగ్యనగరంలోని జంట జలాశయాల్లోకి భారీగా వరద వచ్చి చేరుతోంది. జంట జలాశయాల నుంచి మూసీలోకి 2,118 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు.

Hyderabad: జంట జలాశయాల్లోకి భారీగా వరద

హైదరాబాద్: భాగ్యనగరంలోని జంట జలాశయాల్లోకి భారీగా వరద వచ్చి చేరుతోంది. జంట జలాశయాల నుంచి  మూసీలోకి 2,118 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. ఇన్ ప్లోను బట్టి అవుట్ ఫ్లో పెంచుతున్నారు. ఉస్మాన్ సాగర్(Osman sagar) ఇన్‌ఫ్లో  1600 క్యూసెక్కులుగా ఉంది. ఉస్మాన్  సాగర్ నుంచి ఆరు గేట్ల ద్వారా  1788 క్యూసెక్కుల నీటిని మూసిలోకి విడుదల చేస్తున్నారు. ఉస్మాన్  సాగర్ పూర్తిస్థాయి  నీటిమట్టం 1790 అడుగులు కాగా... ప్రస్తుత నీటి మట్టం 1787.20 అడుగులుగా ఉంది. హిమాయత్  సాగర్‌కు 300 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది. హిమాయత్  సాగర్(Himayath sagar) రెండు ద్వారా మూసీలోకి  330 క్యూసెక్కుల నీరు వెళ్తోంది. హిమాయత్  సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1763.50 అడుగులకు గాను... ప్రస్తుత  నీటిమట్టం 1760.70 అడుగులుగా నమోదు అయ్యింది. 

Updated Date - 2022-07-25T15:28:07+05:30 IST