లారీ బీభత్సం.. తల్లీకూతుళ్ల మృతి..

Published: Tue, 14 Sep 2021 18:08:48 ISTfb-iconwhatsapp-icontwitter-icon
లారీ బీభత్సం.. తల్లీకూతుళ్ల మృతి..

గుంటూరు: తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డులో మంగళవారం ఓ లారీ బీభత్సం సృష్టించింది. స్కూటీపై వెళ్తున్న తల్లీకూతుళ్ల మీదకు వేగంగా దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో తల్లీకూతుళ్లయిన షేక్ హసీనా సుల్తానా(34), షేక్ అప్సా (10).. అక్కడికక్కడే మృతి చెందారు. కుమార్తెను స్కూల్ నుంచి ఇంటికి తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. లారీ మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.