అలా లేకుంటే ఇప్పటికే ఇండస్ర్టీనుంచి వెళ్లిపోయేవాణ్ని!

ABN , First Publish Date - 2022-08-15T08:59:13+05:30 IST

గులాబీ, సింధూరం, చంద్రలేఖ చిత్రాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకుని.. ఇరవై ఎనిమిదేళ్లనుంచీ విభిన్నమైన పాత్రలతో మెప్పిస్తున్న నటుడు బ్రహ్మాజి. ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ ఎం.డీ. వేమూరి రాధాకృష్ణ ‘ఓపెన్‌ హార్ట్‌ విత్‌

అలా లేకుంటే ఇప్పటికే ఇండస్ర్టీనుంచి వెళ్లిపోయేవాణ్ని!

గులాబీ, సింధూరం, చంద్రలేఖ చిత్రాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకుని.. ఇరవై ఎనిమిదేళ్లనుంచీ విభిన్నమైన పాత్రలతో మెప్పిస్తున్న నటుడు బ్రహ్మాజి. ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ ఎం.డీ. వేమూరి రాధాకృష్ణ ‘ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే’ లో బ్రహ్మాజి తన కెరీర్‌తో పాటు పర్సనల్‌ విషయాలను పంచుకున్నారిలా..


ఆర్కే: ఫస్టాఫ్‌కంటే సెకండాఫ్‌ బావుంది కదా!

బ్రహ్మాజి: ఫస్టా్‌ఫలో స్ట్రగుల్‌ ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ సెకండా్‌ఫలో బాధ్యతలు పెరుగుతాయి. కంఫర్టబుల్‌గా ఉంది.


ఆర్కే: చాలా టైమ్‌ పట్టింది? మీకున్న ప్రతిభకి

బ్రహ్మాజి: కర్మ సిద్ధాంతం. అకౌంట్‌లో ఫిక్స్‌డు డిపాజిట్‌లో ఎంత డ్రా చేసుకోవాలో అంతే చేసుకోవాలి. 


ఆర్కే: సినిమా కష్టాలు అనుభవించారా..

బ్రహ్మాజి: అలాంటి కష్టాలేమీ లేవు. ఇంటినుంచి నెలకోసారి డబ్బులు పంపేవారు. మెల్లగా అవకాశాలొచ్చాయి. ఈ లోపు స్నేహితులు దర్శకులయ్యారు. ఫిల్మ్‌ఇన్‌స్టిట్యూట్‌ నుంచి వచ్చాను కాబట్టి కొంత సులువు అయింది.


ఆర్కే: ఇండస్ర్టీలో మీ ఫ్యామిలీలో ఎవరైనా.. 

బ్రహ్మాజి: నాన్నది తూర్పుగోదావరి. తహశీల్దారుగా పని చేశారు. నేను పెరిగింది పశ్చిమ గోదావరిలోని ఏలూరులో. చదువుకునే రోజుల్లో ‘శంకరాభరణం’ సోమయాజులుగారిని రెవిన్యూ డిపార్ట్‌మెంట్‌ వాళ్లు సన్మానం చేసి కాళ్ల మీద పడుతుంటే చూశా. అప్పుడు ఆయన డిప్యూటీ కలెక్టర్‌. అలా గుర్తింపు తెచ్చుకోవాలనే ఫీలింగ్‌ కలిగింది. ఇంట్లో వాళ్లకు తెలికుండా అడయార్‌ ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌కి వెళ్లా. అక్కడ డైలాగులు చెప్పమంటే.. వణుకుతూ చెప్పా. హోమ్‌వర్క్‌ చేసి.. స్టేజ్‌ ఫియర్‌ పోగొట్టుకున్నా. మధు ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో చేరా. 


ఆర్కే: హాస్య పాత్రలతో పాపులారిటీ ఎక్కువ వచ్చింది కదా..

బ్రహ్మాజి: నాకు ఎమోషనల్‌, సీరియస్‌ రోల్స్‌ ఇష్టం. అయితే అదృష్టం కొద్దీ కామెడీ రోల్స్‌తో గుర్తింపు వస్తోంది. కమెడియన్‌గా స్టాంప్‌ వేయించుకోలేదు. విభిన్నమైన పాత్రలు చేయబట్టే ఆడియన్స్‌కి బోర్‌ కొట్టట్లేదు. అందుకే ఇప్పటికీ సర్వైవ్‌ అవుతున్నా. లేకపోతే ఈపాటికే ఇండస్ర్టీనుంచి వెళ్లిపోయేవాణ్ని.


ఆర్కే: కృష్ణవంశీగారితో పరిచయమెలా..

బ్రహ్మాజి: పాండీబజార్‌లో ఓ అడ్డాకు కృష్ణవంశీ వచ్చేవాడు. అక్కడే ఆయనతో పరిచయం. ‘శివ’చిత్రం కోసం కొత్తవారికి అవకాశం ఇస్తున్నారని ఓసారి కృష్ణవంశీ నాకు చెప్పారు. నా బైక్‌లో కృష్ణవంశీని ఎక్కించుకుని అన్నపూర్ణ స్టూడియోకి వెళ్లా. దర్శకుడు తేజ.. ఆడిషన్‌ తీసుకుని తర్వాత చెబుతామన్నారు. ఓ రోజు తేజగారు పిలిచి.. ‘చిన్న వేషం’ ఉందన్నారు. అలా ఆ సినిమాకు నటుడిగా నేను.. అసిస్టెంట్‌ డైరక్టర్‌గా వంశీ చేరాడు. 


ఆర్కే:  కృష్ణవంశీ సినిమా కష్టాలు పడ్డారు కదా.. మీరు ఆదుకున్నారట! 

బ్రహ్మాజి: ఇంటినుంచి డబ్బులొచ్చేవి కాబట్టి నేను హ్యాపీ. సర్‌.. నేను మీ ఆఫీసుకు వచ్చా. ‘లంచ్‌ టైమ్‌ అయింది.. తిను అంటారు’ కదా! నేను చేసింది అదే వంశీ విషయంలో. ఆ రోజు తనని భోజనం చేయమన్నా. అప్పటికి రెండు రోజుల నుంచి అతను భోజనం చేయలేదట. వాస్తవానికి భోజనం పెట్టడం పెద్ద గొప్పేమీ కాదు. నన్ను గుర్తు పెట్టుకుని వేషం ఇవ్వడం ఆయన గొప్పతనం.


ఆర్కే: మీది స్టేబుల్‌గా నడిచింది కెరీర్‌.. రవితేజ కెరీర్‌ అందుకున్నాడు.

బ్రహ్మాజి: రవితేజ పాండీబజార్‌ స్నేహితుడు. ఎక్కువ కష్టాలు పడ్డారు కాబట్టి జప్‌మని వెళ్లిపోయారు. చెప్పాను కదా.. కర్మసిద్ధాంతం.


ఆర్కే: ఇంత తత్వం ఎలా వచ్చింది..

బ్రహ్మాజి: దెబ్బలు తగిలాక. పదేళ్ల నుంచి బుద్ధిజం ఫాలో అవుతున్నా. ప్రశాంతంగా ఉన్నా. 


ఆర్కే: మీది లవ్‌ మ్యారేజా?

బ్రహ్మాజి: తను బెంగాలీ. తను డివోర్స్‌. నేనే ఇష్టపడి పెళ్లి చేసుకున్నా. అప్పటికే తనకు ఓ బాబు. దీంతో మా ఇద్దరికీ ిపిల్లలు వద్దనుకున్నా.


ఆర్కే: పైకి వెళ్లిపోతే ఎవరూ సాయం చేయరు అంటారు. నిజమేనా..

బ్రహ్మాజి: ఎందుకు చేయాలి? అంటాను. మా వోడు, మా క్యాస్ట్‌.. అనుకుంటే కుదరదు. డిమాండ్‌ అండ్‌ సప్లయ్‌ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ టాప్‌ హీరోలు, దర్శకులు పక్కా బిజినెస్‌గా ఆలోచిస్తారు. 


ఆర్కే: మీరు కృష్ణగారికి వీరాభిమాని కదా?

బ్రహ్మాజి: అప్పట్లో పాంప్లెట్స్‌ మీద ‘బ్రహ్మాజి ఫ్యాన్స్‌ అసోషియన్‌’ అని వేసుకుండేవాన్ని. ఒకరోజు ఏలూరు దగ్గరగా ‘చుట్టాలు ఉన్నారు జాగ్రత్త’ సినిమా షూటింగ్‌ జరుగుతోంటే.. నేను కొట్టించిన పాంప్లెట్‌ను నా అభిమాన హీరోకు ఇచ్చా. ‘వెరీ గుడ్‌’ అన్నారాయన. ఇక చిరంజీవి గారి జర్నీ చూస్తే ఆయనకు ఎవరైనా ఫ్యాన్‌ అవుతారు.


ఆర్కే: పవన్‌కళ్యాణ్‌తో మీరు క్లోజ్‌ ఎలా అయ్యారు..

బ్రహ్మాజి: ‘జానీ’ చిత్రం షూటింగ్‌ సమయంలో ఆయనతో స్నేహం కుదిరింది. పాలిటిక్స్‌ మాతో మాట్లాడరు. అభిప్రాయం కూడా అడగరు.


ఆర్కే: మీ అబ్బాయిని హీరో చేశారేంటీ..

బ్రహ్మాజి: మర్చంట్‌ నేవిలో జాబ్‌ చేశాడు. షిప్‌లో ఆర్నెళ్లు పని చేసి బోర్‌ కొట్టి.. నా దగ్గరకి వచ్చి నటిస్తానన్నారు. నేను సినిమాల్లోకి వెళ్తానన్నప్పుడు... మా నాన్న ఏమీ అనలేదు. దీంతో మా అబ్బాయిని ఏమీ అనలేదు. పైగా మా అబ్బాయిని పిలిచి తన అసిస్టెంట్‌గా కృష్ణవంశీ పెట్టుకున్నారు. ఆ తర్వాత ‘పిట్టకథ’ సినిమాతో హీరో అయ్యాడు.  

కృష్ణవంశీ క్లోజ్‌.  ప్రకా్‌షరాజ్‌, జెడి, రవితేజతో జర్నీ బావుంటుంది. ఫ్రెండ్లీగా ఉంటారు. నా అదృష్టమేంటంటే తారక్‌, మహే్‌షబాబులాంటి ఆర్టిస్టులతో పాటు కొందరు దర్శకులు  ప్రేమగా చూస్తారు. 

Updated Date - 2022-08-15T08:59:13+05:30 IST