ఆ చిత్రాలను ఓటీటీ సంస్థలు గుర్తించడం లేదా?

Jun 5 2021 @ 18:56PM

కోలీవుడ్: కరోనా వైరస్‌ కారణంగా చిత్ర పరిశ్రమ అన్ని విధాలుగా స్తంభించిపోయింది. ముఖ్యంగా థియేటర్లు మూతబడడంతో విడుదల కావాల్సిన అనేక చిన్నాపెద్ద సినిమాలు ఆగిపోయాయి. ఇది ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌కు మంచి అవకాశంగా మారింది. దీంతో అనేక ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌... స్టార్‌ హీరోల సినిమాలతో పాటు మంచి కంటెంట్‌ ఉన్న చిత్రాలను కొనుగోలు చేసేందుకు పోటీ పడుతున్నాయి. ఇప్పటివరకు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌లో విడుదలైన చిత్రాల్లో పెద్దగా గుర్తింపు లేని నటీనటులు లేదా చిన్న బడ్జెట్‌ చిత్రాలు ఒక్కటంటే ఒక్కటి లేకపోవడమే దీనికి కారణం. చూస్తుంటే ఇటువంటి చిత్రాలను ఓటీటీ సంస్థలు గుర్తించడం లేదా? లేక వాటికి ఆ చిత్రాలు అవసరం లేదా? అనే టాక్ నడుస్తుంది. తమిళ చిత్ర పరిశ్రమలో అనేక మంది నిర్మాతలు తమ చిత్రాల నిర్మాణాలు పూర్తి చేసి ఎదురు చూస్తున్నారు. ఇలాంటి చిత్రాలను కొనుగోలు చేసేందుకు ఏ ఒక్క ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ ఆసక్తి చూపించడం లేదు. 


అదే సమయంలో పలువురు బడా హీరోలు, నటీమణులు నటించిన.. అలాగే మంచి కంటెంట్‌ ఉన్న చిత్రాలని అనిపించిన చిత్రాలను.. నిర్మాణ బడ్జెట్‌ కంటే ఒకటి రెండు రెట్లు అధిక ధరను చెల్లించి ఆ చిత్ర పూర్తి రైట్స్‌ను కొన్ని పెద్ద సంస్థలు కొనుగోలు చేస్తున్నాయి అలాగే, ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌ కూడా మంచి కంటెంట్‌ లేదా సందేశాత్మక చిత్రాలనే కొనుగోలు చేసేందుకు పోటీ పడుతున్నాయి. సినిమా కంటే.. ఓటీటీలోనే మంచి ఆదరణ లభిస్తుండంతో పాటు లాభాలు కూడా వస్తుండటంతో అటువైపు మొగ్గుచూపుతున్నాయి. మొత్తంమీద ఓటీటీల వివక్ష కారణంగా చిన్న చిత్రాలు, అంతగా గుర్తింపు లేని నటీనటులు నటించిన చిత్రాలు తీవ్రంగా నష్టపోతున్నాయనే విమర్శలు లేకపోలేదు.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.