OTT: ఈ వారం ఓటీటీ చిత్రాలు ఇవే!

Jul 13 2021 @ 16:54PM

కరోనా కారణంగా మూతపడిన సినిమా థియేటర్లకు ప్రభుత్వం అనుమతి దక్కినా ఇంకా తెరుచుకోలేదు. ఈ తరుణంలో కాపీ పూర్తయిన చిత్రాలను ల్యాబ్‌ పెట్టుకుని నష్టపోవడం ఇష్టం లేని నిర్మాతలు ఓటీటీ బాట పడుతున్నారు. కొద్ది రోజులుగా ఓటీటీ వేదిక వివిధ భాషల చిత్రాలతో కళకళలాడుతోంది. ఈ వారం విడుదలయ్యే చిత్రాల వివరాలు మీకోసం...

అమలాపాల్‌ కీలక పాత్ర పోషించిన ‘కుడి ఎడమైతే’ చిత్రం ఈ నెల 16న ఆహా ఓటీటీ ద్వారా విడుదల కానుంది. క్రైమ్‌, సస్పెన్స్‌ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాకు పవన్‌కుమార్‌ దర్శకత్వం వహించారు. మలయాళ నటుడు పహాద్‌ ఫాజిల్‌ తాను నటించిన చిత్రాలను వరుసగా ఓటీటీలో విడుదల చేస్తున్నారు. 30 కోట్ల బడ్జెట్‌తో మహేశ్‌ నారాయణన్‌ దర్శకత్వంలో రూపొందిన ‘మాలిక్‌’ చిత్రాన్ని మొదట థియేటర్‌లో విడుదల చేయాలనుకున్నారు. పరిస్థితులు సహకరించకపోవడంతో ఈ నెల 15న అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా స్ర్టీమింగ్‌ కానుంది. పలు వివాదాలకు గురైన ‘తుఫాన్‌’ చిత్రం కూడా ఓటీటీ బాట పట్టింది. ఫరాన్‌ అక్తర్‌ కథానాయకుడిగా రాకేశ్‌ ఓం ప్రకాశ్‌ దర్శకత్వం వహించిన స్పోర్ట్స్‌ డ్రామా ఇది. ఈ నెల 16న అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదల అవుతోంది. వీటితోపాటు మరికొన్ని చిత్రాలు ఓటీటీలో రానున్నాయి. 




నెట్‌ఫ్లిక్స్‌

గన్‌పౌడర్‌ మిల్క్‌షేక్‌ (జులై 14)

నెవర్‌ హ్యావ్‌ ఐ ఎవర్‌ ఎస్‌2 (జులై 15)

ఫియర్‌ స్ర్టీట్‌ 3(జులై 16)

డీప్‌ (జులై 16)

ఎ పర్ఫెక్ట్‌ ఫిట్‌(జులై 16)

జానీ టెస్ట్‌ (జులై 16)

కాస్మిక్‌ సిన్‌ (జులై 17)

మిల్క్‌ వాటర్‌ (జులై 20)

సోనీ లైవ్‌

వాజా (జులై 16)

హెచ్‌బీవో మ్యాక్స్‌

 స్పేస్‌ జామ్‌-ఏ న్యూ లెగసీ (జులై 16)

డిస్నీ+ హాట్‌స్టార్‌

ది వైట్‌ లోటస్‌ (జులై 13)

క్యాచ్‌ అండ్‌ కిల్‌-ది  పాడ్‌ క్యాస్ట్‌ టేప్స్‌ (జులై 13)

ఆహా

కుడి ఎడమైతే (జులై 16)


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.