OTT: ఈ వారం సినిమాలు ఇవే!

Jul 19 2021 @ 17:21PM

కరోనా పరిస్థితులు తగ్గుముఖం పట్టాయి. ప్రభుత్వం లాక్‌డౌన్‌ ఆంక్షలు తొలగించింది. సినిమాల షూటింగ్‌లు మొదలయ్యాయి. థియేటర్లు మాత్రం ఇంకా తెరుచుకోలేదు. తెరచినా భయంతో ప్రేక్షకుల సినిమాలకు వస్తారా అనేది ప్రశ్నార్ధకమే! దీనితో నష్టాల బారిన పడకుండా నిర్మాతలు తమ చిత్రలను ఓటీటీలో విడుదల చేస్తున్నారు. ప్రతివారం పలు భాషల చిత్రాలు ఓటీటీలో సందడి చేస్తే ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేస్తున్నాయి. ఈ వారం పలు ఓటీటీ మాధ్యమాల్లో విడుదల కానున్న సినిమాలు, సిరీస్‌ల వివరాలు.

తమిళ హిట్‌ చిత్రం ‘అసురన్‌’కు రీమేక్‌గా వెంకటేశ్‌ హీరోగా శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం వహించి ‘నారప్ప’ చిత్రం మంగళవారం అమెజాన్‌ ప్రైమ్‌లో స్ర్టీమింగ్‌ కానుంది. ప్రియమణి ఇందులో కీలక పాత్ర పోషించారు. బాలీవుడ్‌లో వచ్చిన బ్లాక్‌బస్టర్‌ ‘హంగామా’కు కొనసాగింపుగా వస్తున్న చిత్రం ‘హంగామా2’. మలయళం హిట్‌ ‘మిన్నారం’కు రీమేక్‌ ఇది. శిల్పాశెట్టి, మిజాన్‌ జెఫ్రీ, పరేశ్‌ రావల్‌, ప్రణీత కీలక పాత్రధారులు. ప్రియదర్శన్‌ తెరకెక్కించిన ఈ చిత్రం కరోనా వల్ల ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడింది. ఈ నెల 23 నుంచి డిస్నీ ప్లస్‌  హాట్‌స్టార్‌లో విడుదల కానుందీ సినిమా. క్రీడా నేపథ్యంలో పా.రంజిత్‌ తెరకెక్కించిన ‘సార్‌పట్ట’ చిత్రం కూడా ఓటీటీ బాట పట్టింది. ఆర్య హీరోగా నటించిన ఈ సినిమా ఈ నెల 22న అమెజాన్‌ ప్రైమ్‌లో తమిళం, తెలుగు భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. 

నెట్‌ఫ్లిక్స్‌ 

మిల్క్‌ వాటర్‌ (జూలై 20)

చెర్నోబిల్‌ 1986 (జూలై 21)

కజిన్స్‌ (జూలై 22)

కింగ్‌డమ్‌: అసిన్‌ ఆఫ్‌ నార్త్‌ (జులై 24) 

‘ద లాస్ట్‌ లెటర్‌ ఫ్రమ్‌ యువర్‌ లవర్‌’ (జులై 23)

ఫీల్స్‌ లైక్‌ ఇష్క్‌ (జులై 23)

స్కై రోజో సీజన్‌ 2 (జులై 23) 

జీ 5

14 ఫేరే (జూలై 23)

యాపిల్‌ టీవీ ప్లస్‌

టెడ్‌ లాసో సీజన్‌ 2 (జులై 23)

అమెజాన్‌ ప్రైమ్

నారప్ప (జూలై 20)

ఇక్కత్‌ (జూలై 21)

హాస్టల్‌ డేజ్‌ (జూలై 23)

జోల్ట్‌(జూలై 23)

వేలర్‌ (జూలై 23)

డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ 

టర్నర్‌ అండ్‌ హూచ్‌ (జూలై 21)

హంగామా 2 (జూలై 23)

సోనీ లైవ్‌

చుట్జ్‌పా(జూలై 23)

ఆహా...

నీడ(జూలై 23)

హీరో (జూలై 24)

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.