Star Heroines: పెళ్లి చేసుకున్న స్టార్ హీరోయిన్ల మంగళ సూత్రాలు ఎలా ఉన్నాయో చూశారా?

Jul 21 2021 @ 12:06PM

హిందూ సంప్రదాయంలో మంగళ సూత్రంకు ఉన్న ప్రాముఖ్య‌త చాలా గొప్ప‌ది. వివాహ వేడుక‌ల్లో మాంగ‌ళ్యదార‌ణ ముఖ్య‌మైన‌ది. మంగ‌ళ అంటే శుభ‌ప్ర‌ద‌మైన‌ది, శోభాయ‌మానం అనే అర్థం. మంగ‌ళ‌సూత్రం, తాళి, తాళిబొట్టు, పుస్తె, శ‌త‌మానం అనే పేర్ల‌తో పాటు వివిధ ర‌కాలుగా స్త్రీలు మంగ‌ళ‌సూత్రాల‌ను ధ‌రిస్తుంటారు. మ‌రి మ‌నం ఎంత‌గానో అభిమానించే మ‌న అగ్ర క‌థానాయిక‌లు..  ఎలాంటి మంగ‌ళ‌సూత్రాల‌ను ధ‌రిస్తున్నార‌నే విష‌యంపై ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు మీకోసం...

ప్రియాంక చోప్రా:

మ‌న ఇండియన్ సినిమాల్లోనే కాదు, హాలీవుడ్‌లోనూ న‌టిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న ప్రియాంక చోప్రా, అమెరిక‌న్ సింగ‌ర్ నిక్ జోన‌స్‌ను పెళ్లి చేసుకుంది. ప్ర‌త్యేకంగా డిజైన్ చేయ‌బ‌డ్డ మంగ‌ళ‌సూత్రాన్ని ప్రియాంక ధ‌రిస్తుంది. పెళ్లైన కొత్త‌లో ప్రియాంక మంగ‌ళ‌సూత్రం టాక్ ఆఫ్ ది టౌన్ అనే చెప్పాలి. ఇందులో డైమండ్స్‌తో పాటు న‌ల్ల‌, బంగారు పూస‌లు కూడా పొద‌గ‌బ‌డి ఉన్నాయి. 

దీపికా ప‌దుకొనె:

ఈమె త‌న స‌హ బాలీవుడ్ న‌టుడు ర‌ణ‌వీర్ సింగ్‌ను వివాహం చేసుకుంది. బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్‌లోనూ న‌టించిన అగ్ర క‌థానాయిక‌. ఈమె సింగిల్ డైమండ్ చైన్‌లాంటి మంగ‌ళ‌సూత్రాన్ని ధ‌రిస్తుంది. 

స‌మంత అక్కినేని:

అక్కినేని నాగ‌చైత‌న్య‌ను పెళ్లి చేసుకున్న స‌మంత రెండు లైన్స్ న‌ల్ల‌పూసులు ఉండే చిన్న‌పాటి మంగ‌ళ సూత్రాన్ని ధ‌రిస్తుంది. 

కాజ‌ల్ అగ‌ర్వాల్‌:

చిన్ననాటి స్నేహితుడు గౌత‌మ్ కిచ్లుని పెళ్లి చేసుకుంది హీరోయిన్ కాజ‌ల్ అగ‌ర్వాల్‌. ఈమె కూడా సింగిల్ డైమండ్ చైన్‌లాంటి మంగ‌ళ‌సూత్రాన్ని ధ‌రిస్తూనే దాంతో పాటు వ‌జ్రాలు పొద‌గ‌బ‌డ్డ మ‌రో చైన్‌ను కూడా మెడ‌లో ధ‌రిస్తుంది. 

సోన‌మ్ క‌పూర్‌:

బాలీవుడ్ న‌టుడు అనీల్ క‌పూర్ త‌న‌య‌గా సినీ రంగ ప్ర‌వేశం చేసిన ఈమె స్నేహితుడు, వ్యాపార‌వేత్త అయిన ఆనంద్ అహూజాను వివాహం చేసుకుంది. ఈమె సింగిల్ డైమండ్ చైన్ మంగ‌ళ సూత్రాన్ని ధ‌రించిన‌ప్ప‌టికీ అందులో ఆనంద్ ఆహూజా రాశి గుర్తు ఉండేలా డిజైన్ చేసుకుని ధరించ‌డం ఓ డిఫ‌రెంట్ అనాలి. 

అనుష్క శ‌ర్మ‌:

ఇండియన్ క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లిని పెళ్లి చేసుకున్న బాలీవుడ్ హీరోయిన్ అనుష్క‌..సంప్రదాయ‌కంగా ఉండే మంగ‌ళ‌సూత్రాన్ని ధ‌రిస్తుంది. సున్నిత‌మైన, అంద‌మైన డిజైనింగ్‌లో ఈ మంగ‌ళ‌సూత్రం ఉంటుంది. 

యామీ గౌత‌మ్‌:

తెలుగులోనూ ఓ సినిమా చేసిన ఈ బాలీవుడ్ హీరోయిన్‌.. ద‌ర్శ‌కుడు ఆదిత్య ధ‌ర్‌ను పెళ్లి చేసుకుంది. పెండెంట్‌ను పోలిన మంగ‌ళ సూత్రాన్ని చైన్ రూపంలో ధ‌రిస్తుంది యామీ. 

ఐశ్వ‌ర్యారాయ్‌: 

అమితాబ్ బ‌చ్చ‌న్ త‌న‌యుడు, హీరో అభిషేక్ బ‌చ్చ‌న్‌ను ఐశ్వ‌ర్యా రాయ్ పెళ్లి చేసుకుంది. ఈమె న‌ల్ల‌పూస‌ల‌ను పోలిన చైన్‌లో పెండెంట్ ఉండేలా డిజైన్ చేసుకున్న మంగ‌ళ‌సూత్రాన్ని ధ‌రిస్తుంది.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.