Advertisement

మన విద్యుత్‌ సంస్థ దేశంలో అగ్రగామి

Jan 24 2021 @ 00:31AM
అంబేడ్కర్‌ స్ఫూర్తి భవనాన్ని ప్రారంభిస్తున్న సీఎండీ ప్రభాకర్‌రావు

సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు

నల్లగొండ టౌన్‌, జనవరి 23: తెలంగాణ విద్యుత్‌ సంస్థ దేశంలో అగ్రగామిగా నిలిచిందని ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు అన్నారు. రాష్ట్ర విద్యుత్‌శాఖ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయిస్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో శ నివారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తొలుత నూతనంగా నిర్మించిన అంబేడ్కర్‌ స్ఫూర్తి భవనాన్ని ఎస్పీడీసీఎల్‌ సీఎండీ జి.రఘమారెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం సంఘం డైరీని, క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రభాకర్‌రావు మాట్లాడుతూ, రాష్ట్రం ఏర్పడ్డాక ఆరేళ్లలో విద్యుత్‌ సంస్థ అద్భుత ఫలితా లు సాధించిందన్నారు. బాధ్యత ఇంకా పెరిగిందని, కష్టపడి పనిచేసి సంస్థను మరింత ముందుకు తీసుకెళ్లాలన్నారు. రాష్ట్రంలో నాణ్యమైన విద్యుత్‌ను సరఫరాచేస్తున్నామని, 24 గంటల ఉచిత విద్యుత్‌ రైతులకు అందించి న ఘనత రాష్ట్ర ప్రభుత్వానిదే అన్నారు. నిబంధనల ప్రకారం పనిచేస్తే ప్రమాదాలు ఉండవన్నారు. ఎమ్మెల్సీ గోరెటి వెంకన్న మాట్లాడుతూ, సీఎం కేసీఆర్‌ పాలనలో నే విద్యుత్‌ సమస్యను అధిగమించామన్నారు. ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ, గుజరాత్‌ రాష్ట్రంలో ఇప్పటికీ 205 గ్రామాలు చీకట్లో మగ్గుతున్నాయని, 24 గంటల విద్యుత్‌ ఇస్తున్న ఘనత తెలంగాణదే అన్నారు. కార్యక్రమంలో శ్యాంమనోహార్‌, సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.చంద్రయ్య, ప్రభాకర్‌, ప్రధాన కార్యదర్శి మేడి రమేష్‌, వెంకటకృష్ణయ్య, విజయ్‌, సోమ్లా నాయక్‌ పాల్గొన్నారు.

Follow Us on:
Advertisement

ఆంధ్రప్రదేశ్ మరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.