మా జడ్పీటీసీ సభ్యుడు కనిపించడం లేదు

ABN , First Publish Date - 2021-06-20T04:50:46+05:30 IST

మా జడ్పీటీసీ పోతుగంటి భరత్‌ప్రసాద్‌ కొద్ది నెలలుగా కనిపించడం లేదని, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు శనివారం కల్వకుర్తి పోలీస్‌స్టేషన్‌లో ఫి ర్యాదు చేశారు.

మా జడ్పీటీసీ సభ్యుడు కనిపించడం లేదు
పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తున్న కాంగ్రెస్‌ నాయకులు

- పోలీసులకు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్‌ నాయకులు 

కల్వకుర్తి టౌన్‌, జూన్‌ 19 : మా జడ్పీటీసీ పోతుగంటి భరత్‌ప్రసాద్‌ కొద్ది నెలలుగా కనిపించడం లేదని, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు శనివారం కల్వకుర్తి పోలీస్‌స్టేషన్‌లో ఫి ర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మహేందర్‌కు విన తి పత్రం అందజేశారు. అనంతరం కాంగ్రెస్‌ పార్టీ నాయకు లు మాట్లాడుతూ కరోనా విజృంభనతో అన్ని వర్గాల ప్రజ లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రజాప్రతిని ధిగా ఎన్నికైన కల్వకుర్తి జడ్పీటీసీ ప్రజల సమస్యలు పట్టిం చుకోకపోవడం దురదృష్టకరమని అన్నారు. కార్యక్రమంలో బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు విజయ్‌కుమార్‌రెడ్డి, మండల అధ్యక్షుడు బాల్‌రెడ్డి, మాజీ కౌన్సిలర్‌ శ్రీకాంత్‌రెడ్డి ఉన్నారు.


Updated Date - 2021-06-20T04:50:46+05:30 IST