మనది దేశభక్తి.. వారిది కుటుంబ భక్తి

Published: Thu, 07 Apr 2022 04:04:53 ISTfb-iconwhatsapp-icontwitter-icon
మనది దేశభక్తి.. వారిది కుటుంబ భక్తి

వారసత్వ పార్టీలు ప్రజాస్వామ్య శత్రువులు: మోదీ 


న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 6: దేశభక్తికి బీజేపీ ప్రతీక అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీలది కుటుంబ భక్తి అని ఎద్దేవాచేశారు. వారసత్వ పార్టీలు ప్రజాస్వామ్యానికి అతి పెద్ద శత్రువులని, ప్రజలు కూడా క్రమంగా దీనిని గ్రహిస్తున్నారని చెప్పారు. బుధవారం బీజేపీ 42వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని పార్టీ  సభ్యులనుద్దేశించి ఆయన వర్చువల్‌గా ప్రసంగించారు. ‘వారసత్వ పార్టీలు కుటుంబ పాలనకే అంకితం. రాజ్యాంగ విలువలంటే వాటికి లెక్కే లేదు. ఈ పార్టీలు వేర్వేరు రాష్ట్రాల్లో ఉన్నప్పటికీ తమ తమ అవినీతి, దుష్కృత్యాలను కప్పిపుచ్చుకుంటుంటాయి. పైగా వాటి ఏలుబడిలో స్థానిక సంస్థల నుంచి పార్లమెం టు వరకు కొన్ని కుటుంబాలే ఆధిపత్యం చలాయిస్తాయి. నైపుణ్యం కలిగిన యువతను రాజకీయాల్లోకి రానివ్వలేదు. ఆయా పార్టీల అన్యాయా లు, దురాగతాలపై   బీజేపీ కార్యకర్తలు ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడుతున్నారు. ఈ ప్రజాస్వామ్య వ్యతిరేక శక్తులను ఓడించేదాకా మన పోరాటం కొనసాగుతుంది’ అని స్పష్టం చేశారు. గత ప్రభుత్వాలు ఓటుబ్యాంకు రాజకీయాల కోసం సమాజంలోని కొన్ని వర్గాలకే హామీలిచ్చాయని.. అతి పెద్ద వర్గాలను విస్మరించాయని ఆరోపించారు. ఇలాంటి వైఖరి ఎంత ప్రమాదమో ప్రజలకు బీజేపీ తెలియజెప్పిందన్నారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

జాతీయంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.