అమరావతి నుంచి ఔటర్ రింగ్ రోడ్డు ఔట్

Published: Thu, 31 Mar 2022 18:25:30 ISTfb-iconwhatsapp-icontwitter-icon
అమరావతి నుంచి ఔటర్ రింగ్ రోడ్డు ఔట్

అమరావతి: అమరావతి నుంచి ఔటర్ రింగ్ రోడ్డు వద్దని కేంద్రానికి సీఎం జగన్ చెప్పారు. విజయవాడ‌, గుంటూరు, తెనాలిని కలుపుతూ మాజీ సీఎం చంద్రబాబు హయాంలో 180 కిలోమీ రింగ్ రోడ్డుకు ప్రతిపాదనలు పంపారు. జగన్ అధికారంలోకి రాగానే అమరావతి రింగ్ రోడ్డుకు మంగళం పాడారు. కేవలం ఈస్ట్రన్‌ బైపాస్‌ రోడ్డుకు మాత్రమే జగన్‌ ఓకే చెప్పారు. 78 కిలోమీటర్ల మేర విజయవాడ ఈస్ట్రన్ బైపాస్ రోడ్డును నిర్మించనున్నారు. ఔటర్ రింగ్ రోడ్డుకు మించి రాయితీలు.. మినహాయింపులు ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం అంగీకరించింది. ఉచితంగా భూమితో పాటు సిమెంట్, స్టీల్, ఇసుకపై జీఎస్టీ మినహాయింపునకు ఏపీ ప్రభుత్వం అంగీకారం తెలిపింది. 17న జరిగిన భేటీలో ఈస్ట్రన్ బైపాస్‌కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకారం తెలిపాయి. ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై కేంద్రం త్వరలో నివేదిక ఇవ్వనుంది. లోక్‌సభలో వైసీపీ ఎంపీల ప్రశ్నలకు ఔటర్ రింగ్ రోడ్డుపై కేంద్రమంత్రి గడ్కరీ సమాధానమిచ్చారు. 


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.