Shocker caught on camera: రోడ్డుపై బురఖా మహిళను లైంగికంగా వేధించిన ఆకతాయి

ABN , First Publish Date - 2022-07-19T15:33:23+05:30 IST

పాకిస్థాన్ దేశంలో మరో దారుణం తాజాగా వెలుగుచూసింది....

Shocker caught on camera: రోడ్డుపై బురఖా మహిళను లైంగికంగా వేధించిన ఆకతాయి

ఇస్లామాబాద్‌(పాకిస్థాన్):పాకిస్థాన్(Pakistan) దేశంలో మరో దారుణం తాజాగా వెలుగుచూసింది. ఇస్లామాబాద్‌(Islamabad) నగరంలో బురఖా ధరించిన మహిళను గుర్తుతెలియని వ్యక్తి వెనుక నుంచి వేధించిన దారుణమైన ఘటన సీసీటీవీ కెమెరాలో(caught on CCTV camera) రికార్డు అయింది. ఇస్లామాబాద్‌ నగర వీధిలో బురఖా ధరించిన మహిళ(burqa-clad woman) నడుచుకుంటూ వెళుతుండగా, వెనుక నుంచి ఒక వ్యక్తి ఆమెను వెంబడిస్తున్నట్లు వీడియో చూపిస్తోంది. పాక్ సీనియర్ జర్నలిస్ట్ హమీద్ మీర్ ఈ వీడియోను పోస్ట్ చేసిన ట్వీట్‌ను (Tweet) నెటిజన్లతో పంచుకున్నారు. ఈ సంఘటన దోషిని గుర్తించి, అతన్ని శిక్షించి, ఇతరులకు గుణపాఠం చెప్పాలని హమీద్ పేర్కొన్నారు. అంతకుముందు పాకిస్థాన్‌లోని మెట్రో స్టేషన్ వెలుపల పలువురు పురుషులు టర్కీ మహిళను వేధించిన వీడియో వైరల్‌గా మారింది.


గతేడాది పాకిస్థాన్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా వీడియో తీస్తున్న సమయంలో లాహోర్‌లో వందలాది మంది తనపై దాడి చేశారని ఓ టిక్‌టాకర్ ఆరోపించింది. పాకిస్థాన్‌ దేశంలో 70 శాతం మంది మహిళలు పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులకు గురవుతున్నారని, వారి కష్టాలకు అంతు లేదని నివేదికలు చెబుతున్నాయి. 2004, 2016 మధ్య 4,734 మంది మహిళలు లైంగిక హింసను ఎదుర్కొన్నారని మహిళల హక్కుల కోసం పనిచేస్తున్న వైట్ రిబ్బన్ పాకిస్తాన్ అనే స్వచ్ఛందసంస్థ వెల్లడించింది. పాకిస్థాన్ ప్రభుత్వం పని స్థలంలో లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా రక్షణ (సవరణ బిల్లు) 2022ను ఆమోదించింది. పాక్ దేశంమహిళలపై మానసిక, శారీరక లైంగిక వేధింపుల సమస్యతో పోరాడుతోంది. 


Updated Date - 2022-07-19T15:33:23+05:30 IST