అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగం పేరిట మోసం

Sep 22 2021 @ 01:05AM
నిందితుడి వివరాలు తెలియజేస్తున్న పోలీసులు

ఎంప్లాయిమెంట్‌  ఆఫీస్‌ అటెండర్‌ అరెస్టు


చిత్తూరు, సెప్టెంబరు 21: అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను మోసం చేసి డబ్బులు వసూలు చేసిన సంఘటనలో ఎంప్లాయిమెంట్‌  ఆఫీస్‌ అటెండర్‌ను మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. ఒకటో పట్టణ సీఐ నరసింహరాజు తెలిపిన వివరాల మేరకు.. వివిధ ప్రభుత్వశాఖల్లో అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగాలు తీసిస్తామని నిరుద్యోగుల నుంచి ఎంప్లాయిమెంట్‌ ఆఫీస్‌లో అటెండర్‌గా పనిచేసే రేణుబాబు లక్షలాది రూపాయలు వసూలు చేశాడు. ఉద్యోగం తీసిస్తానని చెప్పి రూ.4.70 లక్షలు తీసుకుని, మోసం చేశాడని నగరానికి చెందిన సాయికృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు మంగళవారం ఉదయం నగర శివారులోని సాంబయ్యకండ్రిగ వద్ద రేణుబాబును అదుపులోకి తీసుకుని విచారించారు. రాఘవేంద్రబాబు వద్ద రూ.6లక్షలు, శశికాంత్‌ వద్ద రూ.8లక్షలు, సుందర్‌రాజన్‌ వద్ద రూ.లక్ష తీసుకున్నాడని తేలింది. సాయంత్రం నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.