కేబుల్‌ బ్రిడ్స్‌కు ఔట్‌ స్టాండింగ్‌ కాంక్రీట్‌ స్ట్రక్చర్‌-21 అవార్డు

Published: Sat, 26 Mar 2022 23:51:45 ISTfb-iconwhatsapp-icontwitter-icon
 కేబుల్‌ బ్రిడ్స్‌కు ఔట్‌ స్టాండింగ్‌ కాంక్రీట్‌ స్ట్రక్చర్‌-21 అవార్డు

 

కరీంనగర్‌ టౌన్‌, మార్చి 26: కరీంనగర్‌లో  నిర్మిస్తున్న కేబుల్‌ బ్రిడ్జి ఔట్‌ స్టాండింగ్‌ కాంక్రీట్‌ స్ట్రక్చర్‌-2021 అవార్డును సొంతం చేసుకున్నది. ఇండియన్‌ కాంక్రీట్‌ ఇనిస్టిట్యూట్‌ హైదరాబాద్‌ సెంటర్‌ ఆధ్వర్యంలో నిర్వహకులు ఈ నెల 23న ఆర్‌అండ్‌బీ శాఖకు అవార్డును అందజేశారు. శనివారం రాష్ట్ర రోడ్లు భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డిని  మినిస్టర్‌ క్వార్టర్స్‌లోని ఆయన నివాసంలో ఆర్‌అండ్‌బీ ఈఎన్‌సీలు రవీందర్‌రావు, గణపతిరెడ్డి కలిసి అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మార్గదర్శనంలో రాష్ట్రంలో నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక నిర్మాణాలు శాశ్వత ప్రాతిపదికన పూర్తి నాణ్యతా ప్రమాణాలతో జరుగుతున్నాయన్నారు. రోడ్లు భవనాల శాఖకు వచ్చిన ఈ అవార్డు అధికారుల్లో, ఉద్యోగుల్లో నూతనోత్సహాన్ని నింపుతుందని తెలిపారు. కష్టపడి పనిచేసిన అధికారులు, ఉద్యోగులకు అందులో భాగస్వామ్యమైన ప్రతి ఒక్కరికి మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. 


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.