వ్యాక్సిన్ తీసుకోలేదని.. సిబ్బందిని తొలగించిన అమెరికా ఆస్పత్రి

ABN , First Publish Date - 2021-06-24T02:33:57+05:30 IST

కరోనా వల్ల అత్యంత ఎక్కువగా నష్టపోయిన అగ్రరాజ్యం అమెరికాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా అంతే వేగంగా జరుగుతోంది.

వ్యాక్సిన్ తీసుకోలేదని.. సిబ్బందిని తొలగించిన అమెరికా ఆస్పత్రి

వాషింగ్టన్: కరోనా వల్ల అత్యంత ఎక్కువగా నష్టపోయిన అగ్రరాజ్యం అమెరికాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా అంతే వేగంగా జరుగుతోంది. అయితే కొంతమంది మాత్రం తమపై వ్యాక్సిన్ ప్రయోగాలు చేయడం సబబు కాదంటూ వ్యాక్సీన్ తీసుకోవడానికి నిరాకరిస్తున్నారు. ఇలా వ్యాక్సిన్ తీసుకోని కొందరు ఉద్యోగస్తులను అమెరికాలోని హ్యూస్టన్ మెథాడిస్ట్ హాస్పిటల్ ఉద్యోగాల్లోంచి తొలగించింది. ఇలా మొత్తం 150 మందికిపైగా ఉద్యోగాలు కోల్పోయారు. వీరిలో కొందరిని ఆస్పత్రి యాజమాన్యం ఉద్యోగాల్లోంచి తొలగించగా.. కొందరు తమకు తామే రాజీనామాలు చేసినట్లు సమాచారం. ఈ ఆస్పత్రిలో పనిచేసే వాళ్లందరూ జూన్ 7వ తేదీకల్లా వ్యాక్సిన్ తీసుకోవాలని ఆస్పత్రి యాజమాన్యం మార్గదర్శకాలు విడుదల చేసింది. లేదంటే రెండు వారాలు సస్పెండ్ చేస్తామని హెచ్చరించింది. అయినా సరే కొందరు ఉద్యోగులు వ్యాక్సిన్ తీసుకోలేదు. కాగా, వ్యాక్సిన్ తప్పనిసరిగా తీసుకోవాలంటూ ఆస్పత్రి తెచ్చిన నిబంధనను సవాలు చేస్తూ కొందరు ఉద్యోగులు ఇటీవల కోర్టుకెక్కారు. అయితే ఈ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది.

Updated Date - 2021-06-24T02:33:57+05:30 IST