వ్యాక్సినేషన్‌లో మూడోస్థానంలో ఆంధ్రప్రదేశ్

ABN , First Publish Date - 2021-01-25T02:33:47+05:30 IST

దేశంలో కరోనా వైరస్ కొమ్ములు విరిచేందుకు ప్రారంభమైన వ్యాక్సినేషన్ కార్యక్రమం చురుగ్గా సాగుతోంది.

వ్యాక్సినేషన్‌లో మూడోస్థానంలో ఆంధ్రప్రదేశ్

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ కొమ్ములు విరిచేందుకు ప్రారంభమైన వ్యాక్సినేషన్ కార్యక్రమం చురుగ్గా సాగుతోంది. ఈ నెల 16న దేశవ్యాప్తంగా టీకా కార్యక్రమం ప్రారంభం కాగా, ఇప్పటి వరకు 16 లక్షల మందికిపైగా ఆరోగ్య కార్యకర్తలకు టీకా వేసినట్టు కేంద్రం వెల్లడించింది.  నేటి సాయంత్రం 7.30 గంటల నాటికి ఐదు రాష్ట్రాల్లో 31 వేల మందికిపైగా ప్రజలకు టీకా ఇచ్చినట్టు తెలిపింది. కర్ణాటకలో అత్యధికంగా 1,91,443 మందికి టీకా ఇవ్వగా, ఆ తర్వాతి స్థానంలో ఒడిశా, ఆంధ్రప్రదేశ్ ఉన్నట్టు వివరించింది.


కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమై నేటికి 9 రోజులు కాగా, ఇప్పటి వరకు 10 సైడ్ ఎఫెక్ట్ కేసులు వెలుగు చూశాయి. వ్యాక్సినేషన్ డ్రైవ్ తొలుత నెమ్మదిగా ప్రారంభమైనా ఆ తర్వాత క్రమంగా పుంజుకుంది. దేశంలో ప్రస్తుతం కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలను వేస్తున్నారు.


కొవిషీల్డ్ టీకాను ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ-ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేయగా, పూణేలోని సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో తయారు చేశారు. కొవాగ్జిన్ వ్యాక్సిన్ పూర్తిగా దేశీయంగానే తయారైంది. దీనిని హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్, భారత ప్రభుత్వ సంస్థ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) సంయుక్తంగా అభివృద్ధి చేశాయి.   

Updated Date - 2021-01-25T02:33:47+05:30 IST