అగ్రరాజ్యంలో వేగవంతంగా కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ

ABN , First Publish Date - 2020-12-29T17:48:38+05:30 IST

కరోనాతో సతమతమవుతున్న అగ్రరాజ్యంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా జరుగుతోంది.

అగ్రరాజ్యంలో వేగవంతంగా కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ

వాషింగ్టన్: కరోనాతో సతమతమవుతున్న అగ్రరాజ్యంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా జరుగుతోంది. ఇప్పటివరకు రెండు మిలియన్ల మందికి పైగా అమెరికన్లకు కరోనా టీకా మొదటి డోసు ఇవ్వడం పూర్తైనట్లు సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) సోమవారం వెల్లడించింది. దేశవ్యాప్తంగా 21,27,143 మంది వ్యాక్సిన్ తీసుకున్నట్లు సీడీసీ పేర్కొంది. కాగా, ఇప్పటికే అమెరికా వ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు 1,14,45,175 డోసుల కరోనా వ్యాక్సిన్ పంపిణీ జరిగిందని సీడీసీ అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం అమెరికాలో ఫైజర్, మోడెర్నా వ్యాక్సిన్లు ప్రజలకు అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. ఇక ప్రపంచంలోనే అత్యధిక కేసులు, మరణాలతో అగ్రస్థానంలో కొనసాగుతున్న అమెరికాలో ఇప్పటివరకు కోటి 92 లక్షలకు పైగా మంది వైరస్ బారినపడగా.. 3.34 లక్షల మంది మరణించారని జాన్స్ హాప్కిన్స్ యూనివర్శిటీ వెల్లడించింది. గత ఏడు రోజులుగా దేశవ్యాప్తంగా డైలీ లక్షకు పైగా కేసులు నమోదవుతున్నట్లు తెలిపింది. 

Updated Date - 2020-12-29T17:48:38+05:30 IST