Indians Went Abroad: రెండున్నరేళ్లలో విదేశాలకు 28లక్షల మంది భారత పౌరులు

ABN , First Publish Date - 2022-08-05T16:57:42+05:30 IST

డిచిన రెండున్నరేళ్లలో ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం 28 లక్షల మందికి పైగా భారతీయులు విదేశాలకు వెళ్లిన్నట్లు తాజాగా కేంద్రం వెల్లడించిన డేటా ద్వారా తెలిసింది. ఇలా ఉపాధి కోసం విదేశాలకు వెళ్లిన వారిలో 4.16లక్షల మంది ఈసీఆర్ (Emigration Check Required) దేశాలకు వెళ్లిన్నట్లు కేంద్రం తెలిపింది. ఈ మేరకు లోక్‌సభలో విదేశాంగ...

Indians Went Abroad: రెండున్నరేళ్లలో విదేశాలకు 28లక్షల మంది భారత పౌరులు

న్యూఢిల్లీ: గడిచిన రెండున్నరేళ్లలో ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం 28 లక్షల మందికి పైగా భారతీయులు విదేశాలకు వెళ్లిన్నట్లు తాజాగా కేంద్రం వెల్లడించిన డేటా ద్వారా తెలిసింది. ఇలా ఉపాధి కోసం విదేశాలకు వెళ్లిన వారిలో 4.16లక్షల మంది ఈసీఆర్ (Emigration Check Required) దేశాలకు వెళ్లిన్నట్లు కేంద్రం తెలిపింది. ఈ మేరకు లోక్‌సభలో విదేశాంగ మంత్రిత్వశాఖ (Ministry of External Affairs) లిఖితపూర్వకంగా 2020 జనవరి నుంచి 2022 జూలై వరకు రెండున్నరేళ్లలో విదేశాలకు వెళ్లిన భారతీయ పౌరుల వివరాలను వెల్లడించింది.


కేంద్రం వెల్లడించిన డేటా ప్రకారం.. 2020లో 7.15 లక్షల మంది, 2012లో 8.33 లక్షల మంది, 2022 జూలై వరకు 13.02 లక్షల మంది విదేశాలకు వెళ్లడం జరిగింది. ఇలా ఈ రెండున్నరేళ్లలో మొత్తం 28.51 లక్షల మంది విదేశాలకు వెళ్లారు. విదేశాలకు వెళ్లేవారి వీసాలు, వారు చెప్పిన వివరాల ఆధారంగా ఈ డేటాను సేకరించినట్లు సమాచారం. వీరిలో అత్యధికంగా 1.31లక్షల (32శాతం) మంది యూపీ నుంచి వెళ్లారు.


ఆ తర్వాత బిహార్ (69,518), బెంగాల్ (32,630), రాజస్థాన్ (31,204), తమిళనాడు (26,015), కేరళ (25,302), ఆంధ్రప్రదేశ్ (18,275), పంజాబ్ (14,255), తెలంగాణ (13,401) ఉన్నాయి. ఇక కేంద్రం చెప్పిన వివరాల ప్రకారం 17 దేశాలకు ఇమ్మిగ్రేషన్ క్లీయరేన్స్ అవసరం ఉంటుంది. ఆఫ్గనిస్థాన్, బహ్రెయిన్, ఇరాక్, ఇండోనేషియా, సౌదీ అరేబియా, కువైత్, జోర్డాన్, లిబియా, లెబనాన్, మలేషియా, ఒమన్, ఖతర్, సుడాన్, సిరియా, థాయిలాండ్, యూఏఈ, యెమెన్‌కు ఇమిగ్రేషన్ క్లీయరేన్స్ తప్పనిసరి. 1983 ఇమిగ్రేషన్ చట్టం ప్రకారం భారతీయ పౌరులకు విదేశాలకు వెళ్లేందుకు ఇమిగ్రేషన్ క్లీయరేన్స్ తప్పనిసరి. 

Updated Date - 2022-08-05T16:57:42+05:30 IST