అమెరికాలో ఆసియన్లపై దాడులు పెరిగాయ్

ABN , First Publish Date - 2021-08-15T00:33:52+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాలో ఈ మధ్య కాలంలో శ్వేతజాతీయులు ఆసియన్లపై విపరీతంగా దాడులు జరుపుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ‘స్టాప్ ఏఏపీఐ హేట్’ అనే స్వచ్ఛంద సంస్థ ఓ నివేదికను విడుదల చేసిం

అమెరికాలో ఆసియన్లపై దాడులు పెరిగాయ్

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో ఈ మధ్య కాలంలో శ్వేతజాతీయులు ఆసియన్లపై విపరీతంగా దాడులు జరుపుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ‘స్టాప్ ఏఏపీఐ హేట్’ అనే స్వచ్ఛంద సంస్థ ఓ నివేదికను విడుదల చేసింది. కరోనా విజృంభణ ప్రారంభమైన నాటి నుంచి అమెరికా వ్యాప్తంగా 9వేల యాంటీ ఆసియన్ సంఘటనలు చోటు చేసుకున్నట్టు తన నివేదికలో పేర్కొంది. అమెరికాలో ఉన్న ఆసియన్లపై గత సంవత్సరం 4,548 భౌతిక దాడులు జరిగితే.. ఈ ఏడాది ఇప్పటి వరకు 4,533 దాడులు జరిగినట్టు వెల్లడించింది. గత సంవత్సరంతో పోల్చితే ఆసియన్లపై జరుతున్న దాడులు 6.6శాతం పెరిగినట్టు పేర్కొంది. కాగా.. ఆసియన్ అమెరికన్లపై జాతి వివక్ష దాడులు పెరుగుతున్న క్రమంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. గతంలోనే ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.


Updated Date - 2021-08-15T00:33:52+05:30 IST