మేడ్చల్ జట్టుకు ట్రోఫీ అందజేస్తున్న అతిథులు
- ముగిసిన రాష్ట్రస్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీలు
హనుమకొండ క్రైం, మార్చి 27: హనుమకొండ జవహర్లాల్ నెహ్రూ మైదానంలో నిర్వహించిన 8వ రాష్ట్రస్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీలు ఆదివారం ముగిశాయి. రెండు రోజులు జరిగిన పోటీల్లో అత్యధిక మెడల్స్ సాధించి మేడ్చల్ క్రీడాకారులు 717 పాయింట్లతో ఓవరాల్ చాంప్‌గా నిలిచారు. జంప్స్, త్రోస్, పరుగులో 78గోల్డ్, 57 సిల్వర్, 30 బ్రాంజ్ మెడల్స్ సాధించారు. రెండో స్థానంలో హైదరాబాద్ నిలిచింది. సంగారెడ్డి మూడో స్థానంలో ఉంది. రాష్ట్రంలోని 27జిల్లాల నుంచి 572 మంది పురుషులు, 250 మంది మహిళలు పోటీపడ్డారు. కార్యక్రమంలో చీఫ్‌విప్ వినయ్‌భాస్కర్ నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభుకుమార్, రాష్ట్ర కోశాధికారి లక్ష్మి, జిల్లా అధ్యక్షుడు బాబురావు, క్రీడల ఆర్గనైజింగ్ కార్యదర్శి భారతి, డీఎ్‌సడీవో అశోక్, అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి సారంగపాణి పాల్గొన్నారు.