అక్కడి జనాభా ప్రభావం ఇతర రాష్ట్రాలపై పడుతోంది: సంజయ్ రౌత్

ABN , First Publish Date - 2021-07-18T19:45:01+05:30 IST

ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో అధిక జనాభా ప్రభావం ఇతర రాష్ట్రాలపై కూడా పడుతోందని..

అక్కడి జనాభా ప్రభావం ఇతర రాష్ట్రాలపై పడుతోంది: సంజయ్ రౌత్

ముంబై: ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో అధిక జనాభా ప్రభావం ఇతర రాష్ట్రాలపై కూడా పడుతోందని , యూపీలో జనాభా అదుపు బిల్లు ప్రభావాన్ని విశ్లేషించిన తర్వాత దానిపై జాతీయ స్థాయిలో తమ పార్టీ చర్చకు తెస్తుందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఆదివారంనాడు చెప్పారు. ఎన్నికలు దగ్గరపడుతున్నాయనే కారణంగా బిల్లు తెస్తుంటే మాత్రం అది సరికాదని ఆయన అన్నారు.


జనాభా పెరుగుదలను 2.1 శాతానికి తెచ్చే లక్ష్యంతోనే రాష్ట్ర జనాభా విధానం 2021-2030 అమలు చేయనున్నామని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గత ఆదివారంనాడు ప్రకటించారు. ఇద్దరు పిల్లల విధానాన్ని పాటించని వాళ్లు ప్రభుత్వ పథకాలు, ఇతర ప్రయోజనాలు కోల్పోతారని అన్నారు. జనాభా పెరుగుదల వల్ల సమాజంలో సమతుల్యత లోపిస్తోందని, సమాజాభివృద్ధికి జనాభా నియంత్రణ తప్పనిసరని అన్నారు. కాగా, కమ్యూనల్ ఎజాండాను అసెంబ్లీ ఎన్నికల్లో సజీవం చేసేందుకే జనాభా నియంత్రణ విధానాన్ని యూపీ సర్కార్ ప్రకటించిందని కాంగ్రెస్ పార్టీ తప్పుపట్టింది.

Updated Date - 2021-07-18T19:45:01+05:30 IST