సొంత భూమిలో కరోనా మృతుల అంత్యక్రియలకు ప్రభుత్వం అనుమతి

ABN , First Publish Date - 2021-04-23T16:48:29+05:30 IST

కరోనాతో మృతిచెందితే ప్రభుత్వ స్మశాన వాటికల్లోనే అంత్యక్రియలు జరపాలన్న నిబంధనలను ప్రభుత్వం సడలించింది. సొంత భూమి కలిగివుండి వారు అక్కడే అంత్యక్రియలు

సొంత భూమిలో కరోనా మృతుల అంత్యక్రియలకు ప్రభుత్వం అనుమతి


బెంగళూరు: కరోనాతో మృతిచెందితే ప్రభుత్వ స్మశాన వాటికల్లోనే అంత్యక్రియలు జరపాలన్న నిబంధనలను ప్రభుత్వం సడలించింది. సొంత భూమి కలిగివుండి వారు అక్కడే అంత్యక్రియలు జరుపుకోవాలనుకుంటే వారికి అనుమతులి స్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బెంగళూరు సహా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ కొవిడ్‌ మృతులు అనూహ్యం గా పెరుగుతున్నారు. ఈ కారణంగా బెంగళూరులో స్మశాన వాటికల వద్ద పదుల సంఖ్యలో అంబులెన్స్‌లు బారులుదీరుతున్నాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు రెవెన్యూ శాఖా మంత్రి అశోక్‌ గురువారం ఉత్తర్వులను సడలిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇకపై సొంత భూమిలోనూ అంత్యక్రియలు జరుపుకొనేందుకు వీలుంటంది. అయితే కొవిడ్‌ నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. 


Updated Date - 2021-04-23T16:48:29+05:30 IST