రాజస్థాన్‌లో శివాలయం కూల్చివేతపై ఒవైసీ ఘాటు విమర్శలు

ABN , First Publish Date - 2022-04-24T18:49:46+05:30 IST

రాజస్థాన్‌లోని 300 సంవత్సరాల చరిత్రగల శివాలయాన్ని కూల్చివేయడంపై

రాజస్థాన్‌లో శివాలయం కూల్చివేతపై ఒవైసీ ఘాటు విమర్శలు

హైదరాబాద్ : రాజస్థాన్‌లోని 300 సంవత్సరాల చరిత్రగల శివాలయాన్ని కూల్చివేయడంపై ఏఐఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఘాటుగా స్పందించారు. అన్ని మతాలకు స్వేచ్ఛ ఉండాలనే అంశాన్ని తమ పార్టీ విశ్వసిస్తుందన్నారు. శివాలయం కూల్చివేతపై ప్రజలకు కాంగ్రెస్, బీజేపీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. 


ఒవైసీ విలేకర్లతో మాట్లాడుతూ, రాజస్థాన్‌లోని ఆళ్వార్‌లో ఉన్న 300 సంవత్సరాల చరిత్రగల శివాలయాన్ని కూల్చేశారని, ఈ విషయంలో తమకు సంబంధం లేదని కాంగ్రెస్ చేతులు దులిపేసుకుందని చెప్పారు. ఇది రాజ్‌గఢ్ మునిసిపాలిటీ పరిధిలో ఉందని, ఈ మునిసిపాలిటీ పాలక వర్గం బీజేపీదేనని చెప్తోందని తెలిపారు. ఈ శివాలయం కూల్చివేతను తాను ఖండిస్తున్నానని చెప్పారు. మునిసిపల్ బోర్డు బీజేపీ నేతృత్వంలో ఉందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉందన్నారు. శివాలయాన్ని కూల్చేయాలన్న మునిసిపల్ బోర్డు నిర్ణయాన్ని కాంగ్రెస్ నేతృత్వంలోని రాజస్థాన్ ప్రభుత్వం ఆమోదించిందన్నారు. ఈ కూల్చివేతపై ప్రజలకు కాంగ్రెస్, బీజేపీ క్షమాపణలు చెప్పాలన్నారు. 


Updated Date - 2022-04-24T18:49:46+05:30 IST