ఏరియా ఆసుపత్రికి ఆక్సిజన్‌ సిలిండర్ల పంపిణీ

ABN , First Publish Date - 2021-05-11T03:50:15+05:30 IST

స్థానిక ఏరియా ఆసుపత్రికి జనవిజ్ఞానవేదిక, మినీలారీ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో సోమవారం 30 ఆక్సిజన్‌ సిలిండర్లు అందజేశారు.

ఏరియా ఆసుపత్రికి ఆక్సిజన్‌ సిలిండర్ల పంపిణీ
ఏరియా ఆసుపత్రికి ఇచ్చేందుకు సిద్ధం చేసిన ఆక్సిజన్‌ సిలిండర్లు

గూడూరురూరల్‌, మే 10: స్థానిక ఏరియా ఆసుపత్రికి జనవిజ్ఞానవేదిక, మినీలారీ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో సోమవారం 30 ఆక్సిజన్‌ సిలిండర్లు అందజేశారు. ఈ సందర్భంగా జేవీవీ అధ్యక్షుడు వేగూరు రాజేంద్రప్రసాద్‌, మినీలారీ అసోసియేషన్‌ అధ్యక్షుడు గుర్రం విజయబాబు మాట్లాడుతూ కొవిడ్‌ కారణంగా ఆక్సిజన్‌ అందక ఎంతోమంది చనిపోతున్నారన్నారు. ఈ విపత్కర పరిస్థితులలో తమవంతు బాధ్యతగా 200 ఆక్సిజన్‌ సిలిండర్లు నింపి ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ రోజు కార్యక్రమానికి దాతలుగా వ్యవహరించిన వెంకటేశ్వరరావు, నాగరాజులకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. 

Updated Date - 2021-05-11T03:50:15+05:30 IST