Oxygen ఉత్పత్తిలో రాష్ట్రం ముందంజ

ABN , First Publish Date - 2021-12-02T14:09:37+05:30 IST

కరోనా బాధితులను కాపాడేందుకు అవసరమైన ఆక్సిజన్‌ ఉత్పత్తిలో రాష్ట్రం స్వయం సమృద్ధిని సాధించిందని ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం తెలిపారు. అన్నానగర్‌లో సబర్బన్‌ ఆస్పత్రి వద్ద రెనాల్ట్‌ నిసాన్‌ సంస్థ ఆధ్వర్యంలో

Oxygen ఉత్పత్తిలో రాష్ట్రం ముందంజ

చెన్నై: కరోనా బాధితులను కాపాడేందుకు అవసరమైన ఆక్సిజన్‌ ఉత్పత్తిలో రాష్ట్రం స్వయం సమృద్ధిని సాధించిందని ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం తెలిపారు. అన్నానగర్‌లో సబర్బన్‌ ఆస్పత్రి వద్ద రెనాల్ట్‌ నిసాన్‌ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఆక్సిజన్‌ తయారీ ప్లాంట్‌ను బుధవారం ఆయన ప్రారంభించారు. మే నెలలో డీఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కరోనా బాధితులను కాపాడటంలో పలు ప్రైవేటు సంస్థలు ప్రభుత్వానికి సహకరించాయని, ముఖ్యం గా ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ ఉత్పత్తి కర్మాగారాలు, ప్లాంట్లు నెలకొల్పడంలో సాయపడ్డాయని పేర్కొన్నారు. కరోనా వైరస్‌ రెండో దశ వ్యాప్తిలో ఆక్సిజన్‌ కొరత తీవ్ర రూపం దాల్చిందని, ఆ తర్వాత ప్రభుత్వం తీసుకున్న చర్యలతో అన్ని ప్రభుత్వాస్పత్రులకు ఆక్సిజన్‌ ఉత్పత్తి సరఫరా చేయగలిగామని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఆక్సిజన్‌ కొరత ఎక్కడా లేదని ఆయన చెప్పారు. 

Updated Date - 2021-12-02T14:09:37+05:30 IST