TS News: పిఎఫ్ఐని నిషేధించడంపై ఒవైసీది రెండు నాల్కల ధోరణి : విజయశాంతి

ABN , First Publish Date - 2022-10-01T04:08:21+05:30 IST

Hyderabad: పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పిఎఫ్ఐ)పై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించడాన్ని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ తప్పుబట్టడం ఆయన అసలు రూపాన్ని బట్టబయలు చేస్తోందని బీజేపీ నాయకురాలు విజయశాంతి పేర్కొన్నారు. మతోన్మాదంతో ఒక వర్గాన్ని రెచ్చగొడుతూ పిఎఫ్ఐ చేస్తున్న తప్పులను ప్రతి ఒక్కరూ ఖండించాల్సిందేనని ఆమె సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

TS News: పిఎఫ్ఐని నిషేధించడంపై ఒవైసీది రెండు నాల్కల ధోరణి : విజయశాంతి

Hyderabad: పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పిఎఫ్ఐ)పై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించడాన్ని ఎంఐఎం (MIM) అధినేత అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin owaisi) తప్పుబట్టడం ఆయన అసలు రూపాన్ని బట్టబయలు చేస్తోందని బీజేపీ (BJP) నాయకురాలు విజయశాంతి (Vijayashanti) పేర్కొన్నారు. మతోన్మాదంతో ఒక వర్గాన్ని రెచ్చగొడుతూ పిఎఫ్ఐ చేస్తున్న తప్పులను ప్రతి ఒక్కరూ ఖండించాల్సిందేనని ఆమె సోషల్ మీడియాలో పోస్టు చేశారు.  


విజయశాంతి పోస్టు యథాతథంగా..

‘‘దేశంలో కల్లోలం సృష్టించేందుకు అక్రమ మార్గాల్లో నిధులు సేకరిస్తూ ఆధారాలతో సహా దొరికిపోయిన పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పిఎఫ్ఐ)పై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించడాన్ని టిఆర్ఎస్ సయామి  ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ తప్పుబట్టడం ఆయన అసలు రూపాన్ని బట్టబయలు చేస్తోంది. తప్పు చేసిన వ్యక్తుల్ని శిక్షించాలి తప్ప, మొత్తం సంస్థపై నిషేధాన్ని తాను సమర్ధించలేనంటున్నరు. పిఎఫ్ఐ, దాని అనుబంధ సంస్థలు యూపీ, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల్లో చేసిన చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై దొరికిన ఆధారాల మేరకు ఈ సంస్థను నిషేధించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాలు సైతం కేంద్రానికి సిఫార్సు చేశాయి. మతోన్మాదంతో ఒక వర్గాన్ని రెచ్చగొడుతూ పిఎఫ్ఐ చేస్తున్న తప్పులు, అక్రమాలు ఈ రాష్ట్రాలకే పరిమితం కాలేదు... పలు ఇతర రాష్ట్రాల్లోనూ ఆధారాలు దొరికాయి. అలాంటప్పుడు దేశవ్యాప్తంగా నిషేధించక ఏం చెయ్యాలి?  పైగా తాను ఎప్పుడూ పిఎఫ్ఐ విధానాలను వ్యతిరేకిస్తూనే ఉన్నానని చెప్పుకొచ్చిన ఓవైసీ గారు, ఇప్పుడిలా మాట్లాడటం రెండు నాల్కల ధోరణి గాక ఇంకేంటి? అసలు ఓవైసీ గారు నాయకత్వం వహిస్తున్న ఎంఐఎం కూడా ప్రధాని నెహ్రూ హయాంలో దేశవ్యాప్తంగా నిషేధానికి గురైన సంగతి ఆయనకి తెలీదా? అప్పట్లో కేవలం వ్యక్తుల మీద గాక మొత్తం ఎంఐఎం పార్టీనే బ్యాన్ చేశారు. నాటి ఎంఐఎం విధానాలు, పద్ధతులు మారినట్లు అనిపించిన ప్రవర్తన చూపిన తర్వాతే బ్యాన్ తొలగించారు. ఇదంతా తెలిసి కూడా అసదుద్దీన్ ఇలాంటి వ్యాఖ్యలు చెయ్యడం ఆయన అపరిపక్వ వైఖరిని సూచిస్తోంది.’’ అని విజయశాంతి పేర్కొన్నారు. 

Updated Date - 2022-10-01T04:08:21+05:30 IST