పీ నైనవరం సచివాలయం వద్ద సీపీఎం నేతల నిరసన
విజయవాడ రూరల్, జూలై 6 : స్థానిక సమస్యల పరిష్కారం కోసం సీపీఎం ఆధ్వర్యంలో విజయవాడ రూరల్ మండలం పీ నైనవరం సచివాలయం వద్ద బుధవారం నిరసన కార్యక్రమం జరిగింది. ఇంటింటికీ సీపీఎం కార్యక్రమంలో గుర్తించిన సమస్యలపై పార్టీ నాయకులు సచివాలయం కార్యదర్శికి వినతిపత్రం సమర్పించారు. గ్రామాలలో సీసీ రోడ్లు వేయాలని, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని, వీధిలైట్లు ఏర్పాటు చేయాలని, తాగునీరు, సాగునీరు అందించాలని, ఉపాధి హామీ పథకం పనుల బకాయిలను తక్షణమే విడుదల చేయాలని నాయకులు కోరారు. సీపీఎం నేతలు ఇచ్చిన సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతానని సచివాలయ కార్యదర్శి సమాధానమిచ్చారు. ఈ కార్యక్రమంలో పీఎన్ఎం జిల్లా అధ్యక్షుడు జీవీ రంగారెడ్డి, సీపీఎం నేతలు, నాగమల్లేశ్వరరావు, సీహెచ్ రాంబాబు, ఎం కోటేశ్వరరావు, గుంటక చిన వెంకటరెడ్డి పాల్గొన్నారు.
11న కలెక్టరేట్ వద్ద ధర్నాను విజయవంతం చేయాలి
గన్నవరం : రైతు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 11వ తేదీన బందరు కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాలో రైతులు, ప్రజలు, వ్యవసాయకూలీలు పాల్గొని జయప్రదం చేసేలా పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని సీపీఎం కృష్ణాజిల్లా కార్యదర్శి వై.నరసింహారావు పిలుపునిచ్చారు. బుధవారం గన్నవరంలో జరిగిన సీపీఎం, ప్రజా సంఘాల నాయకుల విస్తృత సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో ఉపాధి పనులు చేసిన కూలీలకు డబ్బులు రాని పరిస్థితి ఉందని వారిని ఛైతన్య పరిచి తీసుకురావాలన్నారు. సమావేశంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కళ్లం వెంకటేశ్వరరావు, మండల కార్యదర్శి మల్లంపల్లి ఆంజనేయులు పాల్గొన్నారు.
పెనమలూరు : సీఐటీయూ రాష్ట్రవాప్త పిలుపు మేరకు ఈ నెల 11వ తేదీన జరిగే సమ్మెలో కార్మికులంతా పాల్గొని విజయ వంతం చేయాలని ప్రజా సంఘాల నాయకులు కోరారు. ఈ మేరకు బుధ వారం కార్మిక ప్రజాసంఘాల నాయకులు పోరంకిలోని మానికొండ సుబ్బారావు భవంతిలో రౌండ్‌టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ ప్రకాశరావుకు సమ్మెనోటీసు అ ందజేశారు. సమావేశంలో చౌటుపల్లి రవి, మోతుకూరి అరుణ్‌కుమా ర్, ఉప్పాడ త్రిమూర్తులు, సరళ, పాతాళ లక్ష్మి పాల్గొన్నారు.