ఓఎన్‌జీసీ మెరిట్‌ స్కాలర్‌షిప్స్‌లో ‘పేస్‌’ ఫస్ట్‌

ABN , First Publish Date - 2021-01-22T05:21:43+05:30 IST

స్థానిక పేస్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో ఇంజనీరింగ్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఓఎన్‌జీసీ అందించే నేషనల్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌ల సాధనలో జాతీయ స్థాయిలో ప్రథములుగా నిలిచారు.

ఓఎన్‌జీసీ మెరిట్‌ స్కాలర్‌షిప్స్‌లో ‘పేస్‌’ ఫస్ట్‌
మెరిట్‌ స్కాలర్‌షిప్‌లకు ఎంపికైన పేస్‌ విద్యార్థులు

ఒంగోలువిద్య, జనవరి 21: స్థానిక పేస్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో ఇంజనీరింగ్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఓఎన్‌జీసీ అందించే నేషనల్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌ల సాధనలో జాతీయ స్థాయిలో ప్రథములుగా నిలిచారు. 28 మంది కళాశాల విద్యార్థులు ఈ ఉపకార వేతనాలకు ఎంపికయ్యారు. వీరికి ఒక్కొక్కరికి సంవత్సరానికి రూ. 48 వేలు చొప్పున ఓఎన్‌జీసీ ఇస్తుంది. ఈ సందర్భంగా గురువారం కళా శాలలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ అండ్‌ కరస్పాండెంట్‌ మద్దిశెట్టి శ్రీధర్‌ మాట్లాడుతూ ఇప్పటివరకు తమ కళా శాలలో చదువుతున్న 249 మంది విద్యార్థుల వివిధ సంస్థలు అందిం చే నేషనల్‌ మెరిట్‌ స్కాలర్‌ షిప్‌లకు ఎంపికయ్యారని తెలిపారు. కార్య క్రమంలో ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎం.శ్రీనివాసన్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌ జీవీకే మూర్తి, డి.ప్రసాద్‌, సీహెచ్‌ సాయికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-01-22T05:21:43+05:30 IST