మోచేతులు, మోకాళ్ల తెల్లగా మారాలంటే ఇంట్లోనే ఇలా చేయండి..

ABN , First Publish Date - 2021-12-20T19:30:12+05:30 IST

ఒత్తిడి, రాపిడి వల్ల మోచేతులు, మోకాళ్లు నల్లగా మారతాయి. ఈ ప్రదేశాలు కూడా మిగతా శరీరంలో కలిసిపోయేలా తెల్లగా మారాలంటే ఈ ప్యాక్స్‌ అప్లై చేయాలి.

మోచేతులు, మోకాళ్ల తెల్లగా మారాలంటే ఇంట్లోనే ఇలా చేయండి..

ఆంధ్రజ్యోతి(20-12-2021)

ఒత్తిడి, రాపిడి వల్ల మోచేతులు, మోకాళ్లు నల్లగా మారతాయి. ఈ ప్రదేశాలు కూడా మిగతా శరీరంలో కలిసిపోయేలా తెల్లగా మారాలంటే ఈ ప్యాక్స్‌ అప్లై చేయాలి. 


అలోవెరా జెల్‌: అలోవెరా గుజ్జును పట్టించి అరగంట తర్వాత కడిగేసుకోవాలి. ఇలా రెండు రోజులకోసారి క్రమం తప్పక చేస్తూ ఉంటే కొద్ది రోజుల్లోనే మోచేతులు, మోకాళ్లు తెల్లగా మారతాయి.


పసుపు, తేనె, పాలు: పాలు బ్లీచ్‌లా పనిచేస్తే, తేనె చర్మానికి తేమను అందిస్తుంది. పసుపు క్రిమిసంహారకం. కాబట్టి ఈ మూడింటినీ కలిపి ప్యాక్‌ వేయాలి. పూర్తిగా ఆరాక కడిగేసుకోవాలి. ఇలా వారానికోసారి చేస్తూ ఉంటే మోచేతులు, మోకాళ్ల దగ్గరి చర్మం తేటగా తయారవుతుంది.


ఆలివ్‌ ఆయిల్‌, పంచదార: నలుపు వదలాలంటే స్క్రబ్‌ చేయాలి. ఇందుకోసం ఆలివ్‌ ఆయిల్‌లో పంచదార కలిపి మోచేతులు, మోకాళ్లమీద సున్నితంగా స్క్రబ్‌ చేయాలి. తర్వాత సబ్బునీటితో కడిగేసుకోవాలి. ఇలా వారానికోసారి చేస్తూ ఉండాలి.


నిమ్మరసం: నిమ్మరసం చర్మాన్ని తెల్లబరుస్తుంది. మోకాళ్లు, మోచేతుల మీద నిమ్మరసం అప్లై చేసి గంట తర్వాత కడిగేసుకోవాలి. ఇలా నలుపు వదిలేవరకూ ప్రతిరోజూ చేయాలి.


హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌: సూర్యరశ్మి వల్ల నల్లబడిన చర్మాన్ని హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌ తెల్లబరుస్తుంది. దీన్లో దూదిని ముంచి మోకాళ్లు, మోచేతుల మీద 15 నిమిషాలపాటు రుద్దాలి. రుద్దుతున్నప్పుడే నలుపు తగ్గటం మీరు గమనిస్తారు.

Updated Date - 2021-12-20T19:30:12+05:30 IST