పడమటి గాలులతో పరేషాన్‌

ABN , First Publish Date - 2022-05-25T02:57:16+05:30 IST

పడమటి గాలులు అందరినీ పరేషాన్‌ చేస్తున్నాయి. గాలులకు ఎక్కడెక్కడో ఉన్న దుమ్ము, వ్యర్థాలు ఇళ్లు, దుకాణాల్లోకి చేరుతున్నా

పడమటి గాలులతో పరేషాన్‌
నేలరాలిన మామిడి

పడమటి గాలులు అందరినీ పరేషాన్‌ చేస్తున్నాయి.  గాలులకు ఎక్కడెక్కడో ఉన్న దుమ్ము, వ్యర్థాలు ఇళ్లు, దుకాణాల్లోకి చేరుతున్నాయి. అర్ధరాత్రి 12 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ పడమటి గాలులు  హోరుగా వీస్తుండడంతో రేకులు, రేకు తలుపులు, చెట్లు,  గొళ్లాలులేని ఇంటి తలుపులు, కిటికీ తలుపుల రణగొణ ధ్వనులతో జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఫెక్సీలు, బోర్డులు కొన్ని ధ్వంసం కాగా, కొన్ని నేలపాలయ్యాయి. నిమ్మ, మామిడి కాయలు కూడా నేలరాలిపోతున్నాయి. గాలులకు తరచూ విద్యుత్‌ అంతరాయం కలుగుతున్నది.

- రాపూరు






Updated Date - 2022-05-25T02:57:16+05:30 IST