రైతు పరిస్థితి దయనీయం

ABN , First Publish Date - 2020-12-02T06:06:48+05:30 IST

రైతు పరిస్థితి దయనీయం

రైతు పరిస్థితి దయనీయం
వరి పంటను పరిశీలిస్తున్న మాజీ మంత్రి దేవినేని ఉమా

 జి.కొండూరు, డిసెంబరు 1 : నివర్‌ తుఫాన్‌ దెబ్బకు  రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని, సాయమందించాల్సిన ప్రభుత్వం మొద్దు నిద్ర పోతోందని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వ రరావు మండిపడ్డారు. పినపాకలో మంగళవారం ఆయన దెబ్బతిన్న వరి, మిర్చి పంటలను పరిశీలిం చారు. దెబ్బతిన్న మిర్చి పంటను చూపిస్తూ పినపాక గ్రామానికి చెందిన కలేకూరి మునీంద్రరావు అనే రైతు బోరుమన్నారు. ఈ సందర్భంగా ఉమా మాట్లాడుతూ మాజీ సీఎం చంద్రబాబు  అసెంబ్లీలో ప్రశ్నిస్తే అర్ధరాత్రి ప్రభుత్వం బీమా సొమ్ము విడుదల చేసిందన్నారు. రైతుల కళ్ల వెంట రక్తం వస్తుంటే మంత్రులు బూతులు మాట్లాడుతున్నారని, సీఎం జగన్‌ వెకిలి నవ్వులు నవ్వుతున్నారని దుయ్యబట్టారు. 40 ఏళ్ల అనుభవం ఉన్న వ్యక్తిని పట్టుకొని మంత్రులు అరేయ్‌, ఒరేయ్‌ అని ఎందుకు పిలవకూడదని మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జువ్వా రామకృష్ణ, రౌతు వెంకట సుబ్బారావు, వేములకొండ వెంకటేశ్వరరావు, గరికపాటి జైపాల్‌, స్వామిదాసు, పజ్జూరు రవి కుమార్‌, లంక రామకృష్ణ, గాలి శ్రీనివాసరావు, కలే కూరి రవి, వాగదాని నాగేశ్వరరావు, సుద్దపల్లి నాగ రాజు,  హనుమంతరావు, రామిశెట్టి శ్రీనివాసరావు, అంకెం సురేష్‌, సుకవాసి శ్రీహరి పాల్గొన్నారు.


Updated Date - 2020-12-02T06:06:48+05:30 IST