కళ్లాల నుంచి కదల్లేదు..!

ABN , First Publish Date - 2022-05-26T06:39:50+05:30 IST

ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధరకు కొనేవారు లేరు. వాతావరణ మార్పులతో కళ్లాల్లో ధాన్యం రాశులవద్ద రైతు కంటిపై కునుకు రాని పరిస్థితి ఎదుర్కొంటున్నాడు. జిల్లావ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఈదు రుగాలులు, వర్షాలకు కళ్లాల్లో ధాన్యం ఆరబోసిన రైతులు కలవరం చెందుతున్నారు.

కళ్లాల నుంచి కదల్లేదు..!
మబ్బులు, వర్షాలతో కూడిన వాతావరణానికి బరకాల రక్షణలో ధాన్యం రాశులు

  • కొనుగోళ్ల లక్ష్యం 4లక్షల మెట్రిక్‌ టన్నులు.. కొన్నది 1.25లక్షలే
  • ధాన్యం కొనేవారు కరువు.. కొన్నవాటికి డబ్బుల జమలేదు
  • రూ.210కోట్ల సొమ్ముల విడుదల కోసం ఎదురుచూపులు

సామర్లకోట, మే 25: ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధరకు కొనేవారు లేరు. వాతావరణ మార్పులతో కళ్లాల్లో ధాన్యం రాశులవద్ద రైతు కంటిపై కునుకు రాని పరిస్థితి ఎదుర్కొంటున్నాడు. జిల్లావ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఈదు రుగాలులు, వర్షాలకు కళ్లాల్లో ధాన్యం ఆరబోసిన రైతులు కలవరం చెందుతున్నారు. అన్నిప్రాంతాల్లో ధాన్యం కొనుగోళ్ల కేంద్రాలు ఏర్పాటు చేశామని, మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ప్రకటనలు గుప్పిస్తున్నా క్షేత్రస్థాయిలో కొనుగోళ్లు జరగడం లేదని ఆరోపణలు వస్తున్నాయి.

వ్యవసాయాధికారుల సూచనల మేరకు ఆశాఖ సరఫరా చేసిన సామర్లకోట, పెద్దాపురం తదితర ప్రాంతాల్లో మాసూళ్లు పూర్తయ్యి గురువారంనాటికి 35 రోజులు దాటినా ప్రభుత్వం పెద్దగా ధాన్యం కొనుగోలు చేయలేదని రైతులు ఆ రోపిస్తున్నారు. దీంతో రైతులు నిత్యం ధాన్యానికి రక్షణ చేయలేక, బరకాలకు అద్దెలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ నాణ్యతా ప్రమాణాల తో అమ్మకాలు చేసినా చేతికి డబ్బులు వచ్చేసరికి నెలలు పడుతోందని వాపో తున్నారు. దళారీలు చెప్పిన ధరకు ధాన్యాన్ని అమ్ముకోవాల్సి వస్తుందని చెబు తున్నారు. ఉండూరుకు చెందిన ఓ రైతు తన పొలంలో పండిన 320 బస్తాల ధాన్యాన్ని ఉండూరు రైతు భరోసా కేంద్ర సిబ్బంది సిఫార్సుల మేరకు ఉండూ రు రైస్‌మిల్లుకు సరఫరా చేసి బుధవారం నాటికి 28రోజులు దాటుతున్నా నేటి కీ తనకు డబ్బులు బ్యాంకు ఖాతాలో జమకాలేదని వాపోయారు. ఈదశలో ఖ రీఫ్‌ సాగుకు పెట్టుబడులు ఎక్కడి నుంచి తీసుకురావాలని రైతులు ప్రశ్నిస్తున్నారు. రైతు భరోసా కేంద్రాలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీల వద్ద ధాన్యం తేమ శాతం పరీక్షల్లో పాయింట్ల వెల్లడిలో వ్యత్యాసాలు ఉండడంవల్ల రైతులు నష్టపోవాల్సి వస్తోందని పేర్కొంటున్నారు. తేమశాతం నిర్ధారణలో క్షేత్రస్థాయిలో ఒకలా, పీఏసీఎస్‌ల్లో మరోలా, రైతు భరోసా కేంద్రాల్లో ఈ రెం డింటికీ భిన్నంగా చూపెడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సిబ్బంది కొందరు మిల్లర్ల తరఫున పనిచేస్తున్నా రన్న ఆరోపణలు వస్తున్నాయి. 

1.25 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోళ్లు

జిల్లావ్యాప్తంగా రబీ సీజన్‌లో రైతులనుంచి ఆర్బీకేల ద్వారా 4లక్షల మెట్రిక్‌ టన్నుల మేర ధాన్యం కొనుగోళ్లు చేయాల్సిన లక్ష్యం కాగా బుధవారం ఉదయం నాటికి కేవలం 1.25లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేసిన ట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది. ఇప్పటివరకూ రైతులనుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి రూ.210కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఈ డబ్బులు రైతుల ఖాతాల్లో ఎప్పుడు జమ అవుతాయో, ఎప్పుడు ఖరీఫ్‌ వ్యవసాయ పనులు చేపట్టాలో రైతులకు అర్థం కాని పరిస్థితి నెలకొంది.

Updated Date - 2022-05-26T06:39:50+05:30 IST