సదాశివనగర్‌లో వరి పంట పరిశీలన

ABN , First Publish Date - 2020-10-29T07:32:18+05:30 IST

సదాశివనగర్‌లో దో మపోటుకు గురైన వరి పంటను బుధవారం టీడీపీ ప్రధానకార్యదర్శి కొత్తకోట దయాకర్‌రెడ్డి పరిశీలించా రు.

సదాశివనగర్‌లో వరి పంట పరిశీలన

సదాశివనగర్‌, అక్టోబరు 28: సదాశివనగర్‌లో దో మపోటుకు గురైన వరి పంటను బుధవారం టీడీపీ ప్రధానకార్యదర్శి కొత్తకోట దయాకర్‌రెడ్డి పరిశీలించా రు. సన్నరకం వరిసాగు చేసిన రైతులకు క్వింటా ళుకు రూ.2500 చెల్లించాలని అన్నారు. టీఆర్‌ఎస్‌ ప్ర భుత్వం రైతు ప్రభుత్వం అంటూ రైతులను నిలు వునా ముంచేసిందని, సీఎం నియంతల వ్యవహరి స్తున్నారని, తాను చెప్పినట్లు రైతులు వినాలని లే కుంటే ధాన్యాన్ని కోనుగోలు చేయమని చెప్పడంతో  రైతులు సన్నరకం పంటను వేశారన్నారు. సన్నరకా లు సాగు చేయడంతో పంట దిగుబడి రాక రైతులు ఆందోళన చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గోపాల్‌రెడ్డి, నాయ కుడు రాజేందర్‌, రాజారెడ్డి, లింగారెడ్డి, బాల్‌రెడ్డి, సత్యం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-29T07:32:18+05:30 IST