ఎప్పుడు కొంటారో..

ABN , First Publish Date - 2022-05-14T07:07:33+05:30 IST

దాళ్వా వరికోతలు 50శాతం పైబడి పూర్తయ్యా యి. తుపాను ప్రభావంతో వర్షాలు కురి శాయి. ఏరోజుకారోజు వాతావరణంలో ఊహించని మార్పులు సంభవిస్తున్నా యి. దీంతో రైతులు ధాన్యాన్ని వెంటనే అమ్ముకోవాలని కంగారు పడుతున్నారు.

ఎప్పుడు కొంటారో..

  • అరకొరగా ధాన్యం కొనుగోళ్లు
  • దాళ్వా కొనుగోళ్ల లక్ష్యం 4.09లక్షల మెట్రిక్‌ టన్నులు
  • ఇప్పటివరకూ కొనుగోళ్లు 80 వేల మెట్రిక్‌ టన్నులు
  • కళ్లాల్లోనే ధాన్యం రాశులు
  • రవాణా ఖర్చులు లేవని మిల్లర్లు వెనుకంజ

సామర్లకోట, మే 13: దాళ్వా వరికోతలు 50శాతం పైబడి పూర్తయ్యా యి. తుపాను ప్రభావంతో వర్షాలు కురి శాయి. ఏరోజుకారోజు వాతావరణంలో ఊహించని మార్పులు సంభవిస్తున్నా యి. దీంతో రైతులు ధాన్యాన్ని వెంటనే అమ్ముకోవాలని కంగారు పడుతున్నారు. ప్రభుత్వం ధాన్యం కోనుగోళ్లు సత్వరం చేయడంలో మీనమేషాలు లెక్కిస్తోంది. బహిరంగ మార్కెట్లో ధాన్యానికి గిట్టుబాటు ధర లేదు. గత ఖరీఫ్‌ ధాన్యాన్ని కూడా ప్రభుత్వం అరకొరగానే కొనుగోలు చేసి చేతులెత్తేసింది. నాటి ఖరీఫ్‌ సీజన్‌లో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 10లక్షల మెట్రిక్‌ టన్నుల మేర ధాన్యాన్ని రైతులనుంచి కొనుగోలు చేయాల్సిఉండగా అప్పట్లో 6.90 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేసి ప్రభు త్వం చేతులెత్తేసిన విషయం తెలిసిందే. ప్రతి గింజ రైతునుంచి కొనుగోలు చేస్తామని ఆర్భాటపు ప్రకటనలు మినహా కార్యాచరణలో ఏమీ లేదని రైతులనుంచి ఆరోపణలు వినవస్తున్నాయి. దీంతో దాళ్వా వరిసాగు చేసిన రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరికోత యంత్రాల భారం కూడా అధికంగానే ఉంది. ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పిస్తే తప్ప రానున్న ఖరీఫ్‌ సీజన్‌కు కోలుకోలేని పరిస్థితులు నెలకొన్నాయి.

జిల్లాలో పలు మండలాల్లో ధాన్యం రాశులు కళ్లాలలోనే కని పిస్తున్నాయి. అసాని తుపాను వర్షాలు రైతులను కొంతమేర కరు ణించడంతో స్వల్ప నష్టాలతో బయట పడ్డారు. వర్షం వెలిసి గురు, శుక్రవారాల్లో ఎండలతో రైతులు తమ ధాన్యానికి కప్పిన బరకాలను తొలగించి ఆరబెట్టే పనుల్లో నిమ గ్నమయ్యారు. ధాన్యాన్ని అయినకాడికి అమ్ముకుందామనే ఆతృత రైతుల్లో అధికమైంది. ధాన్యం కొనుగోలులో మిల్లర్లకు ప్రభుత్వం నుంచి రవాణా చార్జీలు చెల్లించకపోవడంవల్ల మిల్లర్లు ఈ దాళ్వా సీజన్‌లో కొనుగోలు చేసేందుకు వెనుకంజ వేస్తున్నట్లు తెలిసింది. అధికారులపై పాలకులు ఒత్తిడి తెస్తున్నా రవాణా చార్జీల బకాయి ల సొమ్ము చెల్లిస్తేనే ధాన్యం కొనుగోలు చేస్తామని మిల్లర్లు భీష్మిం చుకుని కూర్చోవడంతో ఏమీ చేయలేకున్నారు.

అరకొరగా కొనుగోలు...

దాళ్వా ధాన్యాన్ని అరకొరగా కొనుగోలు చేసి చేతులెత్తేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాళ్వా సీజన్‌లో 4.09 లక్షల మెట్రిక్‌ టన్నుల మేర ధాన్యాన్ని రైతులనుంచి కొనుగోలు చేయాలన్న లక్ష్యం నిర్దేశించింది. శుక్రవారం నాటికి 80వేల మెట్రిక్‌ టన్నుల మేర ధాన్యాన్ని మా త్రమే ప్రభుత్వం కొనుగోలు చేసింది. సీజన్‌ పూర్తయ్యేనాటికి కొను గోలు లక్ష్యాన్ని పూర్తి చేస్తారా లేక గత ఖరీఫ్‌ సీజన్‌లో 4లక్షల మెట్రిక్‌ టన్నుల కొనుగోలు లక్ష్యాన్ని వెనుకబడిన రీతిలో దాళ్వా సీజన్‌లో కూడా మమ అనిపిస్తారా అని రైతులు మధనపడుతున్నా రు. ప్రస్తుత పరిస్థితుల్లో రోజుకు 10వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సైతం కొనుగోలు చేయలేకపోవడానికి పలు సమస్యలు సైతం అధికారులు ఎదుర్కొంటున్నట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది. ప్రభుత్వం ఒక దశలో మిల్లర్లపై తీవ్ర ఒత్తిడి తెచ్చి కొనుగోలు చే యాలని పట్టుబడితే కొనుగోలు నిబంధనలు కఠినతరం చేసి తక్కు వ మొత్తంలో ధాన్యాన్ని కొనుగోలు చేస్తారని మరో ప్రచారం రైతు ల్లో వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో రైతుల వద్దకు అధికారులు సైతం వెళ్లేందుకు అంతగా సాహసం చూపడం లేదని తెలుస్తోంది.

Read more